సంక్షేమ ప‌థ‌కాల‌తో పేద‌ల‌కు అండ‌గా ఉంటున్నాం

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేస్తున్నామ‌ని, కన్నీరు, ఆక‌లితో అలమ‌టిస్తున్న పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌తో అండ‌గా ఉంటున్నామ‌ని  రెవెన్యూశాఖా మాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం గుడివీధిలో గ‌డ‌ప గ‌డప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని మంత్రి నిర్వ‌హించారు. ఇక్క‌డి స‌చివాల‌యం ప‌రిధిలో ఉన్న ఇంటింటికీ తిరిగి  ల‌బ్ధిదారుల‌తో భేటీ అయ్యారు. ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక స‌మ‌స్య‌లు గుర్తించారు. ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా  ధ‌ర్మాన మాట్లాడుతూ...సంక్షేమ ప‌థ‌కాల అమలులో భాగంగా ఎవ్వరికీ ఎలాంటి లంచాలు ఇవ్వ‌నవస‌రం లేకుండానే ప‌నిచేస్తున్నామ ని చెప్పారు. ఇవాళ ప‌థ‌కాల అమ‌లు ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాన్నారు. ప‌థ‌కాల పేరిట ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్నాము అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాం అని విప‌క్ష శ్రేణులు అంటున్నాయి కానీ ఎంతమాత్రం  సమంజసం కాదు. పేద పిల్ల‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆర్థిక కార‌ణాల రీత్యా చ‌దువు అర్ధత‌రంగా ఆపేయాల్సిన సంద‌ర్భాలే రాకూడ‌ద‌ని ఈ ప్ర‌భుత్వం అమ్మ ఒడి కార్య‌క్ర‌మం అమలు చేస్తుంద‌న్నారు.

విప‌క్షాల‌కు సూటి ప్ర‌శ్న, ఇవ‌న్నీ దుబారా ఖ‌ర్చే అంటారా ?
ఈ ప‌థ‌కం అమ‌ల్లో భాగంగా బిడ్డ‌ల త‌ల్లులకు ఒక్కొక్కరికీ ప‌దిహేను వేలు రూపాయ‌ల చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తున్నామ‌ని, అదేవిధంగా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కింద నాణ్య‌మైన, స‌మ‌తుల ఆహారం అందిస్తున్నామ‌ని, పిల్ల‌ల‌ను బ‌డికి పంపేవేళ మంచి యూనిఫాంలు, షూ, బ్యాగ్, నోటు పుస్త‌కాలు సైతం అందిస్తున్నామ‌ని, పేద పిల్ల‌లు ఉన్నత విద్య అందుకోవాల న్న త‌ప‌న‌తో ఫీజ్ రీ యింబ‌ర్స్ మెంట్ ను  వ‌ర్తింప‌జేస్తున్నామ‌ని అన్నారు. సంపన్నుల పిల్లలు లానే పేద పిల్లలను ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అదేవిధంగా వృద్ధాప్యం, విక‌లాంగ, వితంతు పింఛ‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వికలాంగులకు పెన్షన్ రూ.3000 అందిస్తున్నామని అన్నారు. స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు చెందిన రుణాల‌ను ఆ రోజు ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు విడత‌ల్లో బ్యాంకుల‌కు తీర్చేశామ‌ని, ఇంకా ఒక్క విడ‌త‌తో మొత్తం రుణం చెల్లింపు పూర్తి అవుతుంద‌ని తెలిపారు. ఇవ‌న్నీ దుబారా ఖ‌ర్చే అంటారా అని ప్రతిపక్షాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

విశాఖే రాజ‌ధాని..ఆ అదృష్టం దూరం చేయ‌వ‌ద్దు
"ఇచ్ఛాపురం నుంచి ర‌ణ స్థ‌లం వ‌ర‌కూ మంచి స్థాయిలో పాఠ‌శాల‌ల నిర్మాణం చేశాం. నాడు నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌. 12,000 కోట్ల‌తో 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు భూమి పంపిణీ.. మీరు ఒక్క ఎక‌రం భూమి కొనుగోలు చేశారా ! మాయ చేసి మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని అనుకుంటున్నారు. ఈ ప్రాంతానికి ఇన్నాళ్ల‌కు అవ‌కాశం వ‌స్తే ప్రతిపక్ష సభ్యులు అభ్యంత‌రం చెప్ప‌డం సమంజ‌సం కాదు. పాద‌యాత్ర‌కు ఎదురెళ్లి స్వాగ‌తం పలుకుతాన‌ని అచ్చెన్నాయుడు చెప్ప‌డం భావ్యం కాదు.

టీడీపీ వ్య‌తిరేక‌త స‌బ‌బు కాదు
ఈ ప్రాంతానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధి అచ్చెన్నాయుడు విశాఖ రాజ‌ధానిని వ్య‌తిరేకించడం స‌బ‌బు కాదు. ఈ జిల్లాలో రాజకీయాల‌కు అతీతంగా అంతా ఏక‌మై అంతా ప‌నిచేయాల్సి ఉంది." అని అన్నారు. మ‌న గ‌డ్డ‌పైకి వ‌చ్చి అమ‌రావ‌తి రైతులు మ‌న ఆకాంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌తామ‌నడం భావ్యం కాద‌న్నారు.రాజ‌ధాని ఏర్పాటు విష‌య‌మై 130 ఏళ్ల తరువాత ఈ ప్రాంతానికి ద‌క్కుతున్న అవ‌కాశాన్ని దూరం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు.

మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను
అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతానికి చేసింది లేదు.  ఒక్క సంస్థ‌ను కూడా  మీరు తెప్పించ‌లేక‌పోయారు.  మీరు చంద్ర‌బాబు పంచ‌న చేరి  ఆయ‌న చెప్పిన విధంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయ‌కులంతా ప్ర‌య‌త్నిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. మ‌నం ఇంత‌కాలం వివిధ సంద‌ర్భాల్లో రాజ‌ధాని పేరిట జ‌రిగిన ఏర్పాటులో  వివిధ సంద‌ర్భాల‌లో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు జ‌గ‌న్  మ‌న‌కు న్యాయం చేయాల‌ని భావిస్తున్నారు. ఇందుకు వ్య‌తిరేకంగా ఎవ్వ‌రు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే ..వారిని మ‌నం వ్య‌తిరేకించాలి. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటాను. అని చెప్పారు.  

చంద్ర‌బాబుది రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం
 రాజధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. కానీ అక్క‌డ ఇప్ప‌టిదాకా చేప‌ట్టిన నిర్మాణాలేవీ క‌నీస స్థాయిలో కూడా పూర్తి కాలేద‌ని, కేవ‌లం ఆయ‌న బినామీల కోస‌మే రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టార‌ని, అందుకోస‌మే ప‌ట్టుబ‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాంతానికి రాజ‌ధాని వ‌స్తే ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని అన్నారు. ఇన్నాళ్లూ ఉపాధి  కోసం సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళామ‌ని,కానీ రాజ‌ధాని ఏర్పాటుతో మున్ముందు అటువంటి ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశాలే ఉండ‌వ‌ని అన్నారు.  

అడుగ‌డుగునా మ‌న‌కు అన్యాయం
కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌లో శ్రీ‌కాకుళంకు ద‌క్కిందేంటి ?
ఇక ఆ రోజు కేంద్ర ప్ర‌భుత్వం 23 సంస్థలు మంజూరు అయితే ఒక్కటి కూడా ఇక్క‌డ నెల‌కొల్ప‌లేద‌ని గుర్తు చేశారు. ఏదేమ‌యినప్ప టికీ ప్రజల ఆత్మ విశ్వాసంతో బ్రతకడమే అభివృద్ధి. ఇందుకు అనుగుణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పాల‌న సాగుతోంది. ఇక ధరల విషయానికే వ‌స్తే దేశం మొత్తం చూడండి.ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. ధ‌రల విష‌య‌మై పొరుగు రాష్ట్రాల‌తో పోల్చి చూడండి. మీకే వాస్త‌వాలు అర్థం అవుతాయి.

ఇక వీటన్నింటితో పాటు మ‌న‌ల్ని అత్య‌ధికంగా ప్ర‌భావితం చేస్తున్న విశాఖ రాజ‌ధాని కోసం ఇప్పుడు అంతా ఆలోచించాలి. మన తాతలు..చెన్నై,మన తండ్రులు కర్నూలు,మనం హైదరాబాద్ వెళ్ళాం. ఇప్పుడు మనకి రాజ‌ధానిగా వైజాగ్ రాబోతోంది. దీనిని మ‌నం స్వాగ‌తించాలి. అడ్డుకునే వారిని వ్య‌తిరేకించాలి. ప్ర‌తిఘ‌టించాలి. విశాఖే రాజ‌ధాని అన్న నినాదంతో ఉద్య‌మించాలి.అనేక దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో మ‌గ్గిపోతోంది,వయసు వచ్చిన యువకులు ఊళ్ల‌ల్లో లేరు. ఇప్పుడు మన పిల్లల బ‌తుకులు మారేందుకు మంచి అవకాశం రాబోతుంది..

ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం
23 సంస్థలను కేంద్రం మన‌కు కేటాయించింది. ఇవ‌న్నీ విభ‌జ‌న‌లో భాగంగా నష్టపోయిన ఆంధ్రాకు పరిహారం నిమిత్తం ఇచ్చిన్న‌వే ! కానీ ఒక్కటంటే ఒక్క‌టి కూడా శ్రీ‌కాకుళం జిల్లాలో పెట్టలేదు నాటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు. ఆయ‌న మనకు అన్యాయం చేశారు. కానీ మేం ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాం. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 3 వేల కోట్ల తో భావన పాడు పోర్టుకు ఆర్థిక అనుమ‌తులు మంజూరు చేశాం. అదేవిధంగా రూ.300 కోట్లతో బుడగుట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి,ఉద్దాన ప్రాంతా నికి తాగునీటిని అందించేందు రూ.700 కోట్లు, అదేవిధంగా గొట్టా బ్యారేజీ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి త‌ద్వారా వంశధారను వ‌చ్చే వేస‌విలో అందించేందుకు రూ.200 కోట్లు వెచ్చించి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని అన్నారు.

Back to Top