విశాఖను వద్దనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు

రాజధాని లేక పోవడానికి చంద్రబాబు కారణం

శివరామకృష్ణ కమిషన్ వికేంద్రీకరణ చేయమని ఎప్పుడో చెప్పింది

రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

రాజ‌మండ్రి : ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ అన్నదే త‌మ నినాదం అని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. రాజ‌మండ్రిలో 3 రాజ‌ధానుల విష‌య‌మై రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇప్పుడున్న అమ‌రావ‌తి నిర్మాణానికి ప‌దిల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని తేలింద‌ని, అంత మొత్తంలో ఓ రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని., ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కే ఉన్న 10 వేల కోట్ల రూపాయ‌లు కూడా ఖ‌ర్చు చేయ‌లేని స్థితిలో ఒక్క ఆంధ్ర ప్ర‌దేశ్ అనే కాదు అన్ని రాష్ట్రాలూ ఉన్నాయ‌ని అన్నారు.

చంద్ర‌బాబు త‌న సొంత మ‌నుషుల ల‌బ్ధి కోస‌మే అమ‌రావ‌తి ప్ర‌తిపాద‌న‌కు బ‌ల‌పరుస్తూ.. మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికైనా మేధావులు ఆలోచించండి.. విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న రాజ‌ధాని ఎందుకు అన్న విష‌య‌మై, విశాల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తిపాద‌న‌లను అర్థం చేసుకోండి అని విన్న‌వించారు. ఎవ్వ‌రికీ అడుగు పెట్ట‌డానికి వీలులేకుండా మేం ఇక్క‌డ విదేశీ పౌరులుగా ఉండాలా అని ప్ర‌శ్నించారు. క్యాపిట‌ల్ కోసం 55 వేల ఎక‌రాలు ఎందుకు.? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం చంద్ర‌బాబు నిర్ణ‌యాల కార‌ణంగా ఎనిమిదేళ్లు రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేశార‌న్ని ప్ర‌శ్నించారు. స‌హేతుక‌త లేని నిర్ణ‌యాలు వ‌ద్దే వ‌ద్దని అన్నారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ..

ప్ర‌జాభిప్రాయం స్వీక‌రిస్తాం
చంద్రబాబు కేవ‌లం త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని ఆరోపించారు. అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని నిర్మాణానాకి నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవ‌సరం అవుతాయ‌ని, అంత మొత్తం ఒక్క ప్రాంతం అభివృద్ధికే వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి అని ప్ర‌శ్నించారు. తాము మ‌రోసారి మోస‌పోయేందుకు సిద్ధంగా లేమ‌ని, మ‌ళ్లీ మ‌రో 70,80 ఏళ్ల పాటు వెనుక‌బాటును భ‌రించేందుకు సిద్ధంగా లేమ‌ని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అన్న పాల‌సీని స్ప‌ష్టంగా చెప్పామ‌ని, దీనినే ఆచ‌రిస్తూ  ప్ర‌జాభిప్రాయం స్వీక‌రించేందుకు జ‌న సమూహాల ముందుకు వెళ్తామ‌న్నారు. 

చంద్ర‌బాబు మాయ‌లో ప‌డ‌వ‌ద్దు
పరిపాలన రాజధాని వద్దని..మీరు పాదయాత్ర చేస్తుంటే ..మేం నోరు మూసుకుని కూర్చోవాలా..? చంద్రబాబు తన పాలనలో.. శ్రీకాకుళానికి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇవ్వలేదు. శివరామకృష్ణన్ కమిటీని తుంగలో తొక్కి...అమరావతిని తెర మీదకు తెచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు మాయ చేశారు. అబద్దాలాడారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని...చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పట్లేదు..అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అందులో సందేహమే లేదు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు. పాల‌కుల కృషితో సృష్టికి నోచుకున్న సంపద అన్న‌ది అందరికీ చెందాలి. ఒక రాష్ట్ర జనాభా సొమ్ము అంతా తీసుకుని వెళ్ళి 29 గ్రామాలని అభివృద్ది చేయడానికి పెట్టాలా? లేదా అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుని ఇంకొంచెం సదుపాయాలు పెంచి,అక్కడ నుండి వచ్చే రెవెన్యుని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధికీ ఉపయోగించాలా ?  ఏది ఈ రాష్ట్రానికి మంచిది ? రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో న‌డుస్తున్న సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. హైదరాబాద్‌లో 75 ఏళ్లు పెట్టుబడి పెట్టి..మనమంతా అభివృద్ది చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆనాడే పెట్టుబడులు పెట్టి  ఉంటే..విభజన జరిగేది కాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తరువాత..మనం తప్పు చేశామని గ్రహించాం..మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెడితే..హైదరాబాద్‌లో చేసిన తప్పే చేసినట్లు అవుతుంది. పెట్టుబడులు కేంద్రీకృతం కాకూడదనేది..ప్రపంచమే చెబుతోంది.

రాజధాని లేదని చంద్రబాబు ఎలా చెబుతారు..?! 
అన్ని ప్రాంతాలకు అనుకూలమైన..మోడల్ ఉండాలని  శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను..చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు. రాజ‌ధాని పేరిట 33వేల ఎకరాల భూములును సేక‌రించి..వాటి చుట్టూ మీరూ,మీ బంధువులు,మీ బినామీలు..మీ పార్టీ నేతలకు కొనిపెట్టారు. ఇదే కదా! మీ స్వార్థం. చంద్రబాబు స్వార్థం ప్రజలకు ఇవాళ తెలుస్తోంది. ప్రజలు గుడ్డి వాళ్లు కాదు. మా ప్ర‌తిపాద‌న‌లు అనుస‌రించి,నిర్ణ‌యాలు అనుస‌రించి అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. రాజధాని లేదని చంద్రబాబు ఎలా చెబుతారు..?! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి...అమరావతిని తెర మీదకు తెచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు మాయ చేశారు. అబద్దాలాడారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని...చంద్రబాబు అండ్ కో మాట్లాడటం తప్పు. అమరావతిలో క్యాపిటల్ వద్దని ప్రభుత్వం చెప్పట్లేదు..అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అదేవిధంగా విశాఖకు పాలన సంబంధ రాజధాని వద్దు అని చెప్పడం బాధాకరం..రాయలసీమకు శాసన సంబంధ రాజధాని వద్దు అని చెప్పడం బాధాకరం. జీడీపీలో మన శ్రీ‌కాకుళం జిల్లా షేర్ ఏంటో చెప్పండి..శ్రీ‌కాకుళం జిల్లా ఇవాళ్టికీ వెనుక‌బ‌డే ఉంది. ఈ సమాజంలో ఎవ్వరూ గౌరవించని పనులు మా ప్రాంతం వాళ్లు చేస్తున్నారు. ఇలా ఎంత కాలం వెనుక‌బాటుత‌నంతోనే ఉండిపోవాలి. ఆ విధంగా మా పీక కోసే పనిచేస్తామంటే మాకు అంగీకారం కాదు.

Back to Top