తెలుగు తియ్యదనాన్ని సామాన్యునికి అందించిన సంస్కర్త గిడుగు రామ్మూర్తి 

తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 
 

శ్రీ‌కాకుళం:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలుగు భాషా దినోత్స‌వ శుభ‌కాంక్ష‌లు తెలిపారు.  సోమ‌వారం మంత్రి ధ‌ర్మాన గిడుగు రామ్మూర్తిని స్మ‌రించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా లోని పర్వతాల పేట వాడుక భాషోద్యమానికి పెట్టని కోటయ్యింది. అది గిడిగు వారి జన్మస్థలం. పండితులకు మాత్రమే పరిమితమై పోయిన తెలుగు తియ్యదనాన్ని సామాన్యునికి అందించిన సంస్కర్త గిడుగు రామ్మూర్తి పంతులు గారు అంటూ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top