మంచిని అడ్డుకోవడమే ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల ఎజెండా

సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

విజ‌య‌వాడ‌: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ది అనైతిక పొత్తు అని స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో రాజకీయాలు చేయాలి కానీ, వీరిద్ద‌రిదీ మిక్స్‌డ్‌ ఎజెండా అని విమ‌ర్శించారు. ప్రజలకు జరిగే మంచిని అడ్డుకోవడమే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ఎజెండా అని ధ్వ‌జ‌మెత్తారు. ప‌వ‌న్‌, బాబు భేటీపై మంత్రి వేణుగోపాల‌కృష్ణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్టర్‌ అయితే పవన్ యాక్టర్‌ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఈరోజు వారిద్దరి కలయిక ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయ‌న్నారు. బలం లేని వాడు పక్కనోడి బలాన్ని తీసుకుని తాను బలవంతుడిని అని చెప్పుకోవాలనే ప్రయత్నం చంద్ర‌బాబుద‌ని ఎద్దేవా చేశారు. ప్రజలో మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని బాబు, ప‌వ‌న్‌ల‌కు మ‌రోసారి త‌గిన బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు. 

Back to Top