మ‌హిళ‌లు భ‌రోసాగా బ‌త‌కాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌

మార్కాపురం స‌భ‌లో బీసీ సంక్షేమం, స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ప్ర‌కాశం జిల్లా: మహిళ‌లు ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌ని, కుటుంబానికి భ‌రోసాగా బ‌త‌కాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న అని, అందుకే అక్క‌చెల్లెమ్మ‌ల పేరుమీదే అనేక సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని బీసీ సంక్షేమం, స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. మార్కాపురంలో వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థ‌కం రెండో విడ‌త అమ‌లు కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొని మాట్లాడారు. ``ఈ రాష్ట్రంలోని ప్రతి పేద మహిళ కష్టం, ఉన్నతి పట్ల ఎంత అంకితభావంతో ఉన్నందున ఆ నారీలోకమంతా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను దీవించారు, అందుకే సకాలంలో వర్షాలు, ప్రాజెక్టులు నిండాయి, అధికంగా దిగుబడులు వచ్చాయి, నారీలోకం పండుగ చేసుకుంటుంది. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ తపస్సు చేశారు, అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పేరుతో మూడేళ్ళపాటు ఏటా రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నారు. బటన్‌ నొక్కగానే అక్క‌చెల్లెమ్మ‌ల బ్యాంక్ ఖాతాల‌కు నేరుగా చేరుతున్నాయి, ఏ మహిళ అయినా భరోసాగా బతకాలన్నదే సీఎం ఆలోచన, మహిళలను దేశానికి ఆదర్శంగా, జ్యోతిరావుపూలే బాటలో ముందుకెళుతున్నారు. ముందుతరాలకు కూడా భరోసానిచ్చే పాలన అందజేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కి ధన్యవాదాలు`` అని మంత్రి చెల్లుబోయిన అన్నారు.

కాసుల వెంకట అరుణ, లబ్దిదారు, మార్కాపురం
``అన్నా.. నా భర్త చిన్న ఉద్యోగస్తుడు, అగ్రవర్ణాలలోని మాలాంటి పేదలను గుర్తించి మీరు సాయం చేస్తున్నారు, ధన్యవాదాలు అన్నా, ఈ డబ్బుకు రూ. 15 వేలకు తోడు మరికొంత కలుపుకుని కిరాణాషాప్‌ పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఇద్దరు పిల్లలు, అమ్మ ఒడి సాయం అందింది, గతంలో ఎప్పుడూ లేని విధంగా నాడు - నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్‌ బాగుచేశారు, జగనన్న గోరుముద్ద బాగుంది, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, మా పాపకు ట్యాబ్‌ ఇచ్చారు, బాగా చదువుకుంటుంది, మా పాప కూడా సీఎంకి థ్యాంక్స్‌ చెప్పమంది, థ్యాంక్స్‌ అన్నా, మాలాంటి పేదలకు సొంతింటి కల నెరవేరింది, మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు బాగున్నాయి, ప్రజల వద్దకు పాలన కాదు ప్రజల దగ్గరికే పాలన అందుతుంది, మీరు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను, మా ప్రాంతానికి మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుచేసినందుకు ధన్యవాదాలు``..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top