సంక్షేమం అ‍ంటే బాబుకు ‘సన్‌’క్షేమం

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ‌

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ​ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం(రాజమండ్రి) రూరల్‌లో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు చేసిన ప్రసంగంపై చెల్లుబోయిన స్పందించారు. సంక్షేమం అంటే చంద్రబాబు తన ‘సన్‌’  క్షేమం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అధికారం కోల్పోయాక మానసికంగా దిగజారిపోయారు. ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. అసలు సంక్షేమం అంటే ఏంటో చంద్రబాబుకు తెలియదు. ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు . 

Back to Top