పాదయాత్ర చేస్తుందంతా రియల్‌ ఎస్టేట్‌ బ్యాచే..

ఆస్తుల విలువ పెంచుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు

రాజధాని ప్రకటన ముందే అమరావతిలో భూములు ఎలా కొన్నారు..?

పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కంభంపాటి, వేమూరి రవి, లింగమనేని రమేష్, సహా 70 మంది లిస్ట్‌ ఉంది

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిన మాట వాస్తవం

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అభివృద్ధి చెందాలని మేం కోరుకుంటున్నాం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మాకు సమానమే అని సీఎం చెప్పారు

ఒక్క అమరావతి అభివృద్ధి కోసమే రాష్ట్ర సంపదనంతా ఖర్చు చేయాలా..?

కొందరి ఆస్తుల విలువ పెంచేందుకు రాష్ట్రం మొత్తం పన్ను కట్టాలా..?

వికేంద్రీకరణపై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: ‘‘అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న వారిలో ఎవరైనా స్థానిక రైతులు ఉన్నారా..? హైదరాబాద్, మరో చోట నుంచి వచ్చిన వారు, భూముల మీద పెట్టుబడి పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ బ్యాచ్‌ మాత్రమే పాదయాత్ర చేస్తుంది. రాజధాని ప్రకటన కూడా చేయకుండా టీడీపీకి చెందినవారంతా అమరావతిలో ఎవరికీ తెలియని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములు, లంక, పోరంబోకు భూములను ఏ విధంగా కొనుగోలు చేశారు’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలోని 33 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలకు టీడీపీకి చెందిన వారి చేతుల్లోనే ఉన్నాయన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ జరిగిన మాట వాస్తవం అని సీఎం వైయస్‌ జగన్‌ గతంలోనే చెప్పారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. 

అసెంబ్లీలో మంత్రి బుగ్గన ఏం మాట్లాడారంటే.. 

శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పింది.. ప్రత్యేక ప్రాంతంలో ఉంటే మరోసారి హైదరాబాద్‌ జరిగినట్టు జరుగుతుంది. ఈ రాష్ట్ర చరిత్ర చూస్తే.. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం వివిధ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప.. ఈ రాష్ట్రానికి సరైన భవిష్యత్తు లేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులంతా అభివృద్ధి అంతా ఒకేచోట చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే కేవలం కొంతమంది చేతుల్లోనే ఈ భూములన్నీ ఉన్నాయి. లంక భూములు తీసుకోవడం, పోరంబోకు భూములు తీసుకోవడం పట్టాలు జారీ చేయడం. 2014 రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగిన తరువాత రాజధాని ప్రాంతం ముందే టీడీపీ శాసనసభ్యులకు మాత్రమే అవగాహన ఉంటుందా..? నారా చంద్రబాబు 14 ఎకరాల భూమి కొనుగోలు చేసింది వాస్తవం కాదా..? ఆ భూమిని ప్రొటెక్ట్‌ చేసుకోవడానికి బౌండరీ మార్చిన మాట వాస్తవం. వేమూరి రవికుమార్‌ నారా లోకేశ్‌ సన్నిహితుడు, శ్రీమతి పరిటాల సునీత, జీవీఎస్‌ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, లంక దినకర్, దూళిపాళ్ల నరేందర్, కబంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్‌యాదవ్‌ వీరంతా ఎస్సీ, ఎస్టీ భూములు చట్ట విరుద్ధంగా తీసుకున్నారు. ప్రాథమిక రిపోర్టులోనే 60 నుంచి 70 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి మాత్రమే రాజధాని అమరావతికి రాబోతుందని తెలుస్తుంది. అందుకే సీఎం వైయస్‌ జగన్‌  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని చెప్పారు. 

రాజధాని రాబోతుందని తెలియకముందే శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలుకు చెందిన టీడీపీ సభ్యులు మాత్రమే కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీ భూములు, లంక, పోరంబోకు భూములు కొనుక్కోవడం, రికార్డులన్నీ తహసీల్దార్‌ ఆఫీస్‌లో బీరువాలో తాళం వేసుకొని పెట్టుకోవడం వాస్తవం కాదా..? 33 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాల వెయ్యి మంది చేతుల్లో ఉంది. రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క అంగుళం కూడా సమానంగా మా కళ్లలో ఉన్నాయని సీఎం మొట్టమొదటి నుంచి చెబుతున్నారు. కానీ, ఒక్క వ్యాపార వర్గం మాత్రం సిండికేట్‌ రూపంలో ఉంది. వ్యాపారం చేసి.. వారికి రావాల్సిన డబ్బుల కోసం రాష్ట్ర భవిష్యత్తును త్యాగం చేయమంటే ముమ్మాటికీ తప్పు. అమరావతి రాజధాని అంటున్నారు. ఏ బిల్డింగ్‌కు కూడా కిటికీలు లేవు. ఇంత దారుణంగా భవనాలు కట్టారు. ఎందుకంటే ఇది తాత్కాలికం. టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని ఆరోజే చెప్పాం. తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి చదరపు అడుగుకు రూ.10 వేలు కేటాయించారు. మొట్టమొదటి ఫేస్‌కు రూ.1 లక్ష కోట్లు కావాలంటా.. చంద్రబాబు చెప్పే లెక్క ప్రకారం రూ.10 లక్షల కోట్లు కావాలి. 30 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఆపి కూడా సరిపోదు. 

పది లక్షల కోట్ల రూపాయల ప్లాన్‌ వేసి.. దాంట్లో ఫస్ట్‌ ఫేస్‌ కింద లక్ష కోట్ల రూపాయలని, దాంట్లో రూ.51 వేల కోట్లతో టెండర్లు చేశారు.  డబ్బులే సమకూర్చకుండా టెండర్లకు వెళ్లారు.. తీరా చేతి నుంచి ఖర్చు చేసింది రూ.1500 కోట్లు కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులు. చందాల పుస్తకం పట్టుకొని బిల్డింగ్‌ కడుతానని చందాల కోసం ఊరంతా తిరిగినట్టుగా చంద్రబాబు తీరు ఉంది. కేవలం ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం తాపత్రయ‌పడుతున్నారు. 

వికేంద్రీకరణ గురించి మాట్లాడేది కేవలం రాజధాని గురించి కాదు.. ఏ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు, ఏవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, ఏ విధంగా గ్రామ సచివాలయాలు, ఏ విధంగా ప్రజల దగ్గరకు పాలన చేరింది, ఏ విధంగా హక్కు ద్వారా చేరాల్సిన సాయం గురించి మాట్లాడుతుంటే.. ఎంతసేపూ బిల్డింగ్‌ల గురించి, బిల్డింగ్‌ల వల్లే పరిపాలన జరుగుతుందని మాట్లాడుతున్నారు. కేవలం వ్యాపారం కోసం టీడీపీ తాపత్రయపడుతుంది. అమరావతిపై కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టే.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరుకూ సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వ్యాపారం చేసేందుకు, స్వలాభం కోసం ఎవరైతే పూనుకుంటారో.. ఆ వ్యాపారం, ఆ స్వలాభం కోసం వేల ఎకరాలు కొంతమంది చేతుల్లో.. ఆ భూములను అభివృద్ధి చేసేందుకు డబ్బులు పెట్టుబడి పెట్టాలి.. వారి ఆస్తుల విలువ పెంచడానికి రాష్ట్రమంతా కలిసి అప్పు చేయాలి.. ఆ అప్పు ప్రజలంతా తీర్చాలి.. ఉపయోగం మాత్రం కొంతమందికి మాత్రమేనా..? ఇది చాలా అన్యాయం. రాష్ట్రం గురించి ఆలోచన చేసేవారు, చరిత్ర తెలిసినవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా..? 

అమరావతి వాసుల పాదయాత్రలో ఎవరైనా స్థానికులు ఉన్నారా..? హైదరాబాద్, మరో చోట నుంచి వచ్చిన వారు, భూముల మీద పెట్టుబడి పెట్టినవారు, రియల్‌ ఎస్టేట్‌ బ్యాచ్‌ పాదయాత్ర చేస్తుంది. 2014లో రాజధాని ప్రాంతం ఏర్పాటు కాకముందే కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మాత్రమే ఏ విధంగా భూములు కొంటారు..? సమానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తాజా వీడియోలు

Back to Top