సీఎం దావోస్‌ పర్యటన రహస్యమేమీ కాదు

టీడీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు

నిసిగ్గుగా టీడీపీ నేత యనమల ఆరోపణలు

ఇస్తాంబుల్, లండన్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ వల్లే ఆలస్యమైంది

సీఎంపై అసూయ, ద్వేషంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా బురదజల్లుతోంది

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పేట్రేగిపోతోందని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనపై యనమల ఆరోపణలు నిసిగ్గుగా ఉన్నాయని, సంస్కారం లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నిమయాలు, నిబంధనలపై అవగాహన లేకుండా పనిగట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌పై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతల దుష్ప్రచారంపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దావోస్‌ పర్యటన రహస్యమేమీ కాదు. విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ ట్రాఫిక్‌తో అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైంది. దీంతో లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునేటప్పటికీ మరింత ఆలస్యమైంది. లండన్‌లో కూడా ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. 

రాత్రి 10 తర్వాత జురెక్‌లో విమానాల ల్యాండింగ్‌ను చాలా ఏళ్ల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార అధికారులకు నివేదించారు. భారత ఎంబసీ అధికారులు లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నేరుగా సీఎం, అధికారులతో చర్చించి.. లండన్‌లోనే సీఎంకు బస ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై అసూయ, ద్వేషంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా బురదజల్లుతోంది. 
 

Back to Top