బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

అమ‌రావ‌తి: బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా బ‌డ్జెట్ రూపొందించామ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి..ఒకే ఒక్క పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గ‌ర్వంగా చెప్పారు. మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్‌ ప్రతులకు పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమ‌ని తెలిపారు. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామ‌ని వివ‌రించారు. ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత అన్నారు. గత ఐదేళ్ల బడ్జెట్‌లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామ‌ని మంత్రి వెల్ల‌డించారు. 

Back to Top