రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: రైతుల సంక్షేమం పట్ల ప్రబుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పెట్టుబడి సాయం కింద రూ.8750 కోట్లు కేటాయింపులు చేసినట్లు చెప్పారు. పెట్టుబడి సాయం కింద రూ.64 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.12,500 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. మహానేత ఆశయాల మేరకు  వచ్చే ఏడాది ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని అక్టోబర్‌ నుంచి అమలు చేస్తామన్నారు.  నీరు–చెట్టు పథకానికి రూ.796 కోట్లు కేటాయించారని, దానికి ఆరు రెట్లు అధికంగా ఖర్చు చేసి టీడీపీ నేతలు దోచుకొని తిన్నారని విమర్శించారు. మట్టి పని చేయకుండానే తీసి అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రుణమాఫీకి బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం రైతులకు రూ.87 వేల కోట్లు రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. రకరకాల సాకులు చూపి రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు.ఇందుకోసం రూ.16,512 కోట్లు కేటాయించి అందులో కేవలం రూ.10,279 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టారన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top