బాబు ఆరోగ్యంపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం

మంత్రి బొత్స సత్యనారాయణ

 విజయనగరం: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలవి తప్పుడు ప్రచారాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. 
చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులకు అనిపిస్తే కోర్టుకు విన్నవించుకోవాలి. జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఆధారాలతో ఇప్పుడు చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్‌ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబుకు అనారోగ్యమంటూ మాట్లాడుతున్నారు. ఎందుకీ డ్రామాలు. నాకు చంద్రబాబు అభిమాని ఫోన్ చేసి ఏడవడం, అది ఓ ఛానల్‌ టెలీకాస్ట్ చేయడం జిమ్మిక్ కాదా. సానుభూతి కోసం కాదా?’’ అని బొత్స ధ్వజమెత్తారు.

‘‘చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాం. ఆయనకు అనారోగ్యంగా ఉంటే కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదు?. జిమ్మిక్కులు చేస్తే నష్టపోయేది టీడీపీయే’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Back to Top