పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది

 మీడియా పాయింట్ వ‌ద్ద మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
 

అమ‌రావ‌తి:   పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇవాళ  ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది అని, పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ఇది అని ఆయన కొనియాడారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని, విద్య ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశమని ఆయన వెల్లడించారు.

 
32 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారని, ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామని, సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు… ఆత్మహత్యలు చూశామని ఆయన తెలిపారు. మా ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే అని ఆయన వ్యాఖ్యానించారు.

Back to Top