అమరావతి: మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. స్కూళ్లు మూసేసాం అని ఈ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారని మండిపడ్డారు. వాస్తవంగా చూస్తే 2014-19 మధ్య 5000 స్కూళ్లు మూసేసారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5వేల స్కూళ్లలో 3వేల స్కూళ్లను తెరిపించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పాఠశాలను కూడా మూయలేదని స్పష్టం చేసారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడ స్కూల్ మూసేసామో ప్రతిపక్షం చెప్పాలని సవాల్ చేస్తున్నాను అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముందుగా మూడు కిలోమీటర్లకు ఒక స్కూల్ ఉండాలని ప్రతిపాదించామని, అయితే మధ్యలో వాగులు, వంకలు, రహదారులు ఉంటాయని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కిలోమీటర్ దూరానికి ఒక స్కూల్ ఉండేలా ఏర్పాటు చేశామని తెలిపారు. స్కూళ్లు విలీనం చేసిన ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయలేదని మంత్రి చెప్పారు. 5419 పోస్టులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. కొంత మంది కోర్టుకు వెళ్తే ప్రమోషన్‌కు అవకాశం లేకపోవడంతో ప్రత్యేక గౌరవవేతనం ఇచ్చి ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌ను నియమించామన్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వైయస్ జగన్‌లాగా ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యాశాఖపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. విద్యార్థి ప్రయోజకులైతే ఆ రాష్ట్రం, కుటుంబం బాగుపడుతుందని మా సీఎం నమ్మారని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే పునాది నుంచి మంచి విద్యను అందించేందుకు వైయస్ జగన్ చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు. వెయ్యి స్కూళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా సున్నీతంగా, సీరియస్‌గా ఆలోచన చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.