నూతన విద్యా విధానం అమలులో దేశంలోనే ఏపీ ముందంజ

మంత్రి బొత్స సత్యనారాయణ  

విజయవాడ: నూతన విద్యా విధానం అమలులో దేశంలోనే ఏపీ ముందుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నూతన విద్యా విధానంపై సెమినార్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు మంత్రి అందించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..లక్ష మందికి పైగా విద్యార్థులకు మైక్రో సాప్ట్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామని  మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు.
 

Back to Top