రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం వైయస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌

మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ‌లో ప్ర‌ధాని స‌భ విజ‌య‌వంతమైంది

రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం 

రుషికొండపై ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.

రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంది వాస్తవం

ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి?

జగనన్న కాలనీల పేరుతో కొత్తగా ఊర్లు కడుతున్నాం

పేదలకు చంద్రబాబు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు?

కండకావరంతో రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారు

విశాఖ: ప్రధాని సభలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం వైయస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల అవసరాలను ప్రధాని దృష్టికి హుందాగా తీసుకెళ్తారని చెప్పారు. కానీ కొన్ని పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యంగా మారాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు వారికే వత్తాసు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర, ప్రభుత్వంపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలని కోరారు. వారి ఆలోచన ఎలా ఉన్నా మాకు  రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. విశాఖలో ప్రధాని సభ విజయవంతమైందని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ విధానాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి స్పష్టంగా చెప్పారు.విశాఖ సభ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ మంచి మెసేజ్‌ ఇచ్చారని మంత్రి తెలిపారు. శనివారం విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎంవీఎస్‌ సత్యనారాయణతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుషికొండపై ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంది వాస్తవం. ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి?. ఈనాడు రామోజీరావుకు ఒళ్లు పోతరం. రాష్ట్రంపైన, సీఎం వైయస్‌ జగన్‌పైన రామోజీరావుకు  అక్కసు. ఉత్తరాంధ్రపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాం. ఏం కంప్లైట్స్‌ చేస్తారు. ఏం చార్జిషిట్లు వేస్తారు. కేంద్రంతో సఖ్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.  బీజేపీలో ఉన్న బీ గ్రూప్‌ టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. టీడీపీ బుద్ధులు, సువాసనలు వారిలో పోలేదు. 
రేపు ఉదయం మా విజయనగరంకు జనసేన నాయకుడు పవన్‌ వెళ్తారట. జగనన్న కాలనీలు చూసేందుకు వెళ్తారట. వెళ్లండి తప్పులేదు. విజయనగరం జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద లే అవుట్‌ ఎక్కడా లేదు. సుమారు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 10 వేల మందికి పక్కా ఇళ్లు ఇచ్చాం. అది ఒక టౌన్‌షిప్‌.అక్కడ ఊరు నిర్మిస్తున్నాం.  అది పూర్తి కావడానికి నాలుగేళ్లు అవుతుంది. వైయస్‌ఆర్‌ హయాంలో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండేవాడిని. అప్పట్లో 20 లక్షల  ఇల్లు నిర్మించారు. ఆ అప్పట్లో కొత్త ఊర్లు వెలిశాయి. అక్కడ అన్యాక్రాంతం జరగడం లేదు. ఇల్లు కట్టుకునే వారికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆలస్యం అవుతుంది. లేదంటే ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఏదో ఒకలాగా ఇల్లు నిర్మిస్తాం. జగనన్న కాలనీల పేరుతో కొత్తగా ఊర్లు కడుతున్నాం. కాలనీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.  పేదల ఇళ్లపై కూడా రాజకీయం చేస్తున్నారు. గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయారు. ఆ రోజు కూడా కేంద్రం ఇళ్లు ఇచ్చింది కదా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇళ్లు నిర్మించలేకపోయారు. ఇళ్లు నిర్మించాలని స్వర్గీయ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయస్‌ జగన్‌కు ఎందుకు వచ్చింది? చంద్రబాబుకు ఎందుకు రాలేదని ఆ రోజు ఈ పత్రికలు ప్రశ్నించలేదే? పేదవారి కష్టాలు వైయస్‌ఆర్‌ కుటుంబం చూసింది కాబట్టి ఇళ్లు నిర్మిస్తున్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వం ప్రధాని సభలోనే హుందాగా మాట్లాడిన మాటలే చెబుతాయి. ఎంతో బాధ్యతతో, కమిట్‌మెంట్‌ మాట్లాడారు. ప్రధాని సభలో వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం పెరిగింది. ఇవాళ రాజకీయ ఉపన్యాసం చేయలేదు. కేంద్ర మంత్రులతో వైయస్‌ జగన్‌ ఎప్పుడు కలిసిన రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారు. దేవుడు పైనుంచి చూస్తుంటారు..వాళ్లను అక్కడే ఉంచుతారు. మమ్మల్ని అధికారంలో ఉంచుతారు. ఎంత కండకావరంతో ఎన్ని రాసుకున్నా..దేవుడు మావైపు ఉంటారు. రుషికొండలో ఇంతకు ముందు టూరిస్ట్‌ గెస్ట్‌హౌస్‌ ఉండేది. మళ్లీ టూరిజం అక్కడ భవనాలు నిర్మిస్తుంది. తప్పెంటి? నిర్మాణాలు చేయకూడదా? నామ్స్‌ అన్ని ఆ శాఖ చూసుకుంటుంది. మేం ప్రైవేట్‌ వాళ్లకు లీజుకు ఇవ్వలేదు కదా?. ఇవాళ జరిగిన ప్రధాన మంత్రి బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున ధన్యవాదాలు మంత్రి బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. 

 

Back to Top