వికేంద్రీక‌ర‌ణే మా ప్ర‌భుత్వ విధానం

రాష్ట్ర సంప‌దంతా 29 గ్రామాల్లో పెడితే.. 5 కోట్ల ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటీ..?

రౌండ్ టేబుల్ స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

కాకినాడ: అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయ‌డం ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని, వికేంద్రీక‌ర‌ణే వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ అభివృద్ధి-పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చించారు. రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదనలపై లోతైన అధ్యయనం చేశామ‌న్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని హితవు పలికారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, దోపిడీ దారులు పాద‌యాత్ర‌గా వ‌స్తున్నార‌ని, రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాన్ని 29 గ్రామాల గోతుల్లో పోయాలంటున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు.  రాష్ట్ర ప్ర‌జ‌లంతా వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నార‌న్నారు. గ‌తంలో చేసుకున్న ఒప్పందాల‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top