అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం వైయ‌స్‌ జగన్ పరిపాలన

విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

శ్రీ‌కాకుళం: రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌.అంబేడ్క‌ర్ స్ఫూర్తితో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంద‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. సామాజిక న్యాయభేరిలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వ విధానాన్ని, పార్టీ తాలుకా అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకువెళతామ‌ని చెప్పారు. సామాజిక విప్లవంలో నూతన ఒరవడిని తీసుకురావడానికి బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకువచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని బాబా సాహెబ్‌ అంబేడ్క‌ర్‌ ఏదైతే చెప్పారో ఆయన స్పూర్తిగా, ఇవాళ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన విధానాన్ని రూపొందించారన్నారు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంతగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అన్నింటా పెద్ద‌పీట వేశార‌న్నారు. స‌రికొత్త సామాజిక విప్ల‌వానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాంది ప‌లికార‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని చెప్పారు. 

Back to Top