విజయవాడలో నీటి సమస్యకు శాశ్వ‌త ప‌రిష్కారం

మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌

విజయవాడ: నగరంలో నీటి సమస్యకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న‌దే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. శనివారం రూ.100 కోట్లతో 24 గంటలూ తాగు నీరు అందించే కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..విజయవాడలో 24 గంటలు నీటిని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రత్యేకంగా విజయవాడ నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సీఎం ఉద్దేశమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top