రాజ‌ధాని విష‌యంలో నా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారు

మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

అసెంబ్లీ: రాజ‌ధాని అంశంలో త‌న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్షం వ‌క్రీకరించి మాట్లాడుతుంద‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే.. దాన్ని ప్ర‌తిప‌క్షం, ప‌చ్చ‌మీడియా రాద్ధాంతం చేస్తున్నాయ‌న్నారు. ప్ర‌తిప‌క్ష ఆరోప‌ణ‌ల‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మాధానం చెప్పారు. మూడు పంట‌లు పండే భూమి ఇప్పుడు చూస్తే శ్మ‌శాన‌వాటిక‌ను త‌యారు చేసిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రూ. ల‌క్షా 9 వేల కోట్ల‌తో అభివృద్ధి చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పి.. ఐదేళ్ల‌లో రూ.5 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. సుమారు రూ. 840 కోట్లు క‌న్సెల్టెంట్ల‌కు ఎంఓయూలు చేశారు. రూ.320 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకొని అమ‌రావ‌తికి వ‌స్తాడ‌ని విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాన‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తుచేశారు. త‌న మాట‌ల‌ను ఆంధ్ర‌జ్యోతిలో చంద్ర‌బాబే వ‌క్రీక‌రించి రాయించి దానిపై రాద్ధాంతం చేస్తున్నాడ‌న్నారు. 

 

రాజ‌ధాని విష‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్త‌శుద్ధితో ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అమరావ‌తి న‌గ‌రం, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల‌నుంచి తీసుకున్న భూముల‌ను డెవ‌ల‌ప్‌మెంట్ చేసి ప్లాట్లు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వివ‌రించారు.  

Read Also: ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ బురద జల్లుతున్నారు

తాజా ఫోటోలు

Back to Top