విజయవాడ: అర్హులైన పేదవారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలోనే ఏపీని రోల్‌మోడల్‌గా నిలపాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మించి ఇస్తామన్నారు. సిమెంట్, స్టీల్ వినియోగం ఎక్కవ జరిగితే.. ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుసాగుతుందన్నారు. బిల్డింగ్ ప్లాన్స్‌కు అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందని, ఇకపై బీపీఎస్ ప్లాన్స్ ఉండవన్నారు. ఆన్‌లైన్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తాం. లోటుపాట్లు సరిచేస్తామని వివరించారు. ఖాళీ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ కల్పిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై వచ్చి పోస్టింగ్స్‌ను మంత్రి బొత్స సత్యనారాణ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ప్రతి అంశాన్ని వాడుకోవడం సరికాదని సూచించారు. లక్షమందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తే దానిపై విమర్శలు చేయడం దారుణమని, చంద్రబాబు తన ఆలోచన ధోరణి మార్చుకోవాలన్నారు.