బషీర్‌బాగ్‌ కాల్పులు గుర్తున్నాయ్‌ బాబూ

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్వీట్‌

ప్ర‌కాశం జిల్లా: చంద్రబాబు అప్పట్లో ఉచిత విద్యుత్‌ను అవహేళన చేశారని, ఆయ‌న పాల‌న‌లో విద్యుత్ చార్జీలు త‌గ్గించాల‌ని ఉద్య‌మిస్తే బ‌షీర్‌బాగ్‌లో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న అంద‌రికీ గుర్తుంద‌ని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో రైతులపై భారం పడుతుందన్న టీడీపీ నేతలు విమ‌ర్శ‌ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.   'రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా చేస్తా.. దివంగత వైయ‌స్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం' అని  బాలినేని శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు.

'బషీర్‌బాగ్‌ కాల్పులు గుర్తున్నాయ్‌ బాబూ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్‌లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. ఆయన నిర్వాకాలను ఎవరూ మరచిపోలేదు' అని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Back to Top