అనుమతి లేని బోట్లపై చర్యలు తీసుకుంటాం

టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి: అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, ఉదయభాస్కర్‌లు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి అవంతి మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తిస్థాయిలో చేపట్టాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటాం. హైవే పెట్రోలింగ్‌ జరిగినట్లే గోదావరిలో బోటు పెట్రోలింగ్‌ జరగాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top