టీడీపీని భ్ర‌ష్టుప‌ట్టించింది లోకేషే

గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలకు అతనే కారణం

లోకేష్‌ నాయకత్వాన్ని ఆ పార్టీలోవారే కోరుకోవడం లేదు

ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే తండ్రీకొడుకుల విమర్శలు

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌కు.. సీఎంను విమర్శించే అర్హత లేదు

తొలి ఏడాదిలోనే 90 శాతం అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చితే.. ఆయన తనయుడు లోకేష్‌ ఆ పార్టీనే భ్రష్టుపట్టించాడని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి  చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని, ప్రభుత్వంపై బురదచల్లేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలకు లోకేష్‌ కారణమని ధ్వజమెత్తారు. లోకేష్‌ నాయకత్వాన్ని ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా కోరుకోవడం లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగిన తర్వాత బాధితులని లోకేష్‌ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. 

విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల పనితీరుపై ఇటీవల సీ–ఓటర్‌ సర్వేలో సీఎం వైయస్‌ జగన్‌ టాప్‌–4 స్థానంలో నిలిచారన్నారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని హామీలు 90 శాతం నెరవేర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నీరుగార్చిందని, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలకు పునర్జీవం పోశారన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారని గుర్తుచేశారు. 

టీడీపీ హయాంలో రూ.వెయ్యి ఉన్న అవ్వాతాతల పెన్షన్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రూ.2,250 చేశారని, ప్రతి నెలా ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకే వలంటీర్ల ద్వారా పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. త్వరలో రూ.2,500 కూడా చేయబోతున్నామన్నారు. జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలను సీఎం వైయస్‌ జగన్‌ పంపిణీ చేయనున్నారన్నారు. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ఇప్పటికే 33 శాతం దుకాణాలను తగ్గించామన్నారు. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ జలయజ్ఞ పేరుతో పెండింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టలు పూర్తి చేయడంపై దృష్టి సారించామని, ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ప్రకటిస్తే.. కుట్రలతో చంద్రబాబు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో విశాఖ భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

చంద్రబాబు, లోకేష్‌ జూమ్, ట్విట్టర్‌కే పరిమితమయ్యారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. లోకేష్‌ చేసే పనికిమాలిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఓడిపోయారనే కారణాలతో కళా వెంకట్రావుని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని లోకేష్‌ కుట్రలు చేస్తున్నారన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్నారు.

Back to Top