వైయస్‌ జగన్‌ చేసి చూపించారు

మంత్రి అవంతి శ్రీనివాస్‌

అమరావతి: చాలా మంది నేతలు బీసీల గురించి మాటల్లో చెప్పారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొట్టమొదటిసారిగా చేతల్లో చేసి చూపించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మీడియా పాయింట్‌ వద్ద అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మక బిల్లును అడ్డుకునేందుకు ఏకంగా స్పీకర్‌పై దాడి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడం బాధాకరమన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని బిల్లు తీసుకురావడం శుభపరిణామమన్నారు. ఈ బిల్లుతో లక్షాలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. టీడీపీ  నేతలు ఎన్ని కుట్రలు చేసినా..వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top