విశాఖలో నీటి సమస్యకు టీడీపీ ఎమ్మెల్యేలే కారణం

టీడీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగింది

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

అమరావతిః గత ఐదు సంవత్సరాలు విశాఖకు నీటి సమస్యే లేనట్లు..ఈ రోజే కొత్తగా నీటి సమస్య వచ్చినట్లు ప్రతిపక్షం మాట్లాడుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో నీటి సమస్య రావడానికి కారణం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేయడంతో  భూగర్భ జలాలు అడుగంటి పోయాయని తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేసి వందల కోట్లు సంపాదించారన్నారు. విశాఖ జిల్లాలో నదులు ఇసుక దోపిడీకి గురువుతున్నాయని ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబుకు చాలాసార్లు చెప్పానని తెలిపారు.దాని ఫలితం నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. నీటి సమస్యపై సమీక్షలు నిర్వహించామని..విశాఖ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి  వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

Back to Top