అమూల్‌ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది 

అమూల్ లీజ్ పాలసీపై అనవసర రాద్ధాంతం ఎందుకు? 

ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోంది

డెయిరీ లీజు గడువు 33 ఏళ్ళ నుంచి 99సంవత్సరాలకు పెంచింది చంద్రబాబు కాదా

విశాఖ‌: అమూల్‌ రాకపోయి ఉంటే పాడి రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డెయిరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు కల్పిస్తున్నామని తెలిపారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

2020 డిసెంబర్ నాటికి గేదె పాల ధర రూ.60-64గా.. ఆవు పాల ధర రూ.31-33 ఉండేదన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.35.20 చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంలో పాల రైతులకు సరాసరి ధర రూ.10 అధికంగా పెరిగిందని మంత్రి అప్పలరాజు అన్నారు. ఇంత కాలం రైతులకు రాకుండా మింగేసిన పాపం ఎవరిది అని నిలదీశారు. ఈ లెక్కలు తీస్తే చంద్రబాబు, ప్రైవేట్ డెయిరీల ఖాతాలోకి వెళ్లిన వేల కోట్ల రూపాయలు వెళ్లాయో తేలుతుందన్నారు. అమూల్ డెయిరీ లీజు గడువు 33 ఏళ్ళ నుంచి 99సంవత్సరాలకు పెంచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అమూల్ లీజ్ పాలసీపై అనవసర రాద్ధాంతం ఎందుకు అని సూటి ప్రశ్న వేశారు. ఏపీకి మొత్తం అప్పు కలిసి రూ.3.8 లక్షల కోట్లు అని కేంద్ర మంత్రి చెప్పారని.. కొన్ని మీడియా సంస్థలు దాన్ని వక్రీకరించి సుమారు 10 లక్షల కోట్ల అప్పు ఉందని రాశారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. తాను రూ.606 కోట్ల అవినీతి చేశానని కొన్ని మీడియా సంస్థలు ఆరోపించాయని.. అవి ఎక్కడ దాచానో కూడా చెప్తే ఆ డబ్బులు తాను తెచ్చుకుంటానని చురకలు అంటించారు.

  టీడీపీ టిష్యూ పేపర్‌ ఈనాడులో సర్వం అమూల్‌ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్‌ కాదు.. సర్వం హెరిటేజ్‌ పాపం అని రాయలన్నారు.  ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్‌ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. 

‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డెయిరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా  చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్‌ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది.

ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని  కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశార‌ని మంత్రి అప్ప‌ల‌రాజు మండిపడ్డారు.

Back to Top