2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం

ప్రాజెక్టు నిర్మాణంతో ఏఒక్కరూ నష్టపోకూడదు..

నిర్వాసితులందరికి న్యాయం చేస్తాం

మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, కురసాల కన్నబాబు

పశ్చిమగోదావరి: .పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ కల్లా పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు,వరద సమయంలో ముంపునకు గురువుతున్న ప్రాంతాలపై చర్చించడం జరిగిందన్నారు. ప్రాజెక్టు పనుల దశలు వారీగా పూర్తయ్యే తీరును అధికారులు వివరించారని తెలిపారు.వరద కారణంగా ఈ నాలుగు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి  ఉందన్నారు.నాలుగు నెలల కాలంలో చేయాల్సిన పనులపై పరిశీలన జరిగిందన్నారు. పనులకు సంబంధించి అధికారుల నుంచి సీఎం అభిప్రాయాలు తీసుకున్నారన్నారు. పనులు నాణ్యతగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రాజెక్టు పనుల్లో ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందుకెళ్తామన్నారు.
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
హడావుడి,అతి ప్రచారం లేకుండా వాస్తవిక దృక్ఫథంతో  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారని వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అన్నారు.ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారని తెలిపారు.నిర్వాసితుల సమస్యలను కూడా ఓపికగా విని ఖచ్చితంగా న్యాయం చేస్తామని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేసారన్నారు.పోలవరం నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో..నిర్వాసితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి ముందుకుకెళ్తామని సీఎం చెప్పారన్నారు.ప్రాజెక్టు నిర్మాణం వల్లన ఏఒక్కరూ నష్టపోకూడదని సీఎం తెలిపారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top