చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకుంటున్నారు 

మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్‌ 
 

నెల్లూరు:  రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా... ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ మండిపడ్డారు. ఆదివారం నెల్లూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న నెల్లూరు జిల్లాలో సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటిస్తారని మంత్రి అనిల్‌ ప్రకటించారు.  అమ్మఒడి పథకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తారని తెలిపారు.  రేపు 45 లక్షల మందికి అమ్మఒడి అందజేస్తాయని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. పేదలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందకుండా అడ్డుపడ్డారన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితం కావాల్సి ఉంటుందన్నారు.

Back to Top