ఐక్యమత్యంతో అభివృద్ధి చేసుకుంటాం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అడుగు ముందుకేశారు

తెలంగాణ ప్రజలు శత్రువు కాదు చంద్రబాబూ.. పద్ధతి మార్చుకో

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి: రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగువాళ్లమంతా అన్నదమ్ముళ్లుగా ఉంటున్నాం. రెండు రాష్ట్రాలు ఐకమత్యంతో కలిసి ఉండి అభివృద్ధి చేసుకుంటున్నామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ అంశంపై అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన తరువాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ కూర్చొని ఏ విధంగా, ఏ రూటింగ్‌తో నీరు తీసుకురావాలని చర్చించేందుకు ఒక అడుగు ముందుకు వేయడం జరగిందన్నారు. పైన రాష్ట్రాలు వదిలితేనే ఆంధ్రరాష్ట్రానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు.. మనం ధర్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న తరువాత 120 రోజుల్లో దాదాపు 4 టీఎంసీల చొప్పున 450 టీఎసీల నీరు తీసుకువచ్చి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నింపి మన రాష్ట్రంతో పాటు, తెలంగాణ ప్రాంతం కూడా ముందుకు వెళ్లాలని ఇద్దరు సీఎంలు ఒక అడుగు ముందుకువేశారన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కచ్చితంగా ఉంటాయన్నారు. రైతులు, ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం ఇబ్బందులు పడొద్దని ముందుకువెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాశ్వత శత్రువులుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా ఆలోచన పక్కనబెట్టాలన్నారు.

 

Back to Top