అమరావతి:ఐదు కోట్ల వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ 8 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని..దీనిని తమ ప్రభుత్వం సహించదని మండిపడ్డారు.పోలవరం పనుల్లో కాంట్రాక్ట్‌లను తమకు బంధువులకు కేటాయించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.అక్రమ కట్టడంలో ఉంటున్న చంద్రబాబు ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు.పేదలు గుడిసె వేసుకుంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అధికార మదంతో అడ్డగోలుగా ప్రజావేదిక భవనం నిర్మించారని ధ్వజమెత్తారు.ప్రక్షాళన ప్రజావేదిక నుంచే మొదలవుతుందన్నారు.