సిగ్గూ, సంస్కారం లేకుండా ‘దొంగ ఓట్ల’ డ్రామా

దొంగ ఓటర్లు అంటూ శ్రీవారి భక్తులను అవమానిస్తున్న టీడీపీ, బీజేపీ 

టీడీపీకి మద్దతుగా ఎల్లో మీడియాలో వెధవ రాజకీయాలు

డిపాజిట్లు రావని దొంగ ఓట్లు వేసుకునే నీచ సంస్కృతి టీడీపీది

తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీదే ఘన విజయం

చంద్రబాబూ ప్రశాంతంగా ఇంటికి వెళ్లి రెస్ట్‌ తీసుకో..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: ఓట్లడగలేని పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపారని, తిరుమల పవిత్రతను మంటగలిపే విధంగా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. తిరుపతికి పర్యాటకులు, శ్రీవారి భక్తులు వస్తుంటే.. వారు వచ్చే బస్సులను ఆపుతూ అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రయాణికులను, భక్తులను చూపిస్తూ దొంగ ఓట్లు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. నెల్లూరులో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

లక్షల మెజార్టీతో గెలిచే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దొంగ ఓట్లు వేయించుకునే అవసరం ఏమిటి?. నిజానికి అలాంటి పరిస్ధితి తెలుగుదేశం పార్టీది. డిపాజిట్లు కూడా రావనే భయంతో దొంగ ఓట్లు వేయించుకునే పరిస్ధితి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలది. కానీ మా పార్టీ çసంస్కృతి అది కాదు.

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో 17.11 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం చూసిన ప్రజలు ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో, తిరుపతి నియోజకవర్గంలో కూడా ప్రజలు వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిని లక్షల మెజార్టీతో గెలిపించబోతున్నారు.

ఈ రెండేళ్ల పరిపాలనలో ఏమేం చేశామన్నది చెబుతూ, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూపుతూ ఓట్లు అడిగాం. కానీ ఓడిపోతామన్న భయంతో విపక్షాలు ఈ ఉదయం నుంచి అసత్య ప్రచారం చేస్తున్నాయి. దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారంటూ కొందరు టూరిస్ట్‌ బస్సుల్లో మహిళల దగ్గరకు వెళ్లి దబాయిస్తున్నారు. శ్రీకాళహస్తి, తిరుమలకు రోజూ కొన్ని వేల బస్సులు వస్తుంటాయి, వారి దగ్గరకు వెళ్లి ఏదో విధంగా ఎల్లో మీడియాలో వెధవ ప్రచారాలు చేస్తున్నారు.

చంద్రబాబుకు, బీజేపీ వారికి సిగ్గుండాలి, ఎన్నికల్లో డిపాజిట్‌ రాదని ఒప్పుకోండి, ఓటమిని ఒప్పుకోకుండా ప్రజలు ఇవ్వబోతున్న తీర్పును గౌరవించకుండా వెధవ ప్రచారం చేస్తున్నారు, మాట్లాడడానికి కనీసం సంస్కారం లేదా?. తిరుమలకు వచ్చే వారిని అవమానించే విధంగా దారుణంగా మాట్లాడుతారా?. మీ హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికకు ఈ ఎన్నికకు తేడా చూడండి, ఎక్కడైనా మేం అధికార దుర్వినియోగం చేశామా?. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తున్నారు. దాదాపు 70 నుంచి 75 శాతం ఓట్లు వైయస్‌ఆర్‌సీపీకి పడుతుంటే ఈ కొత్త డ్రామాకు తెర లేపారు.

సిగ్గూ, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ చంద్రబాబు ఇంత దిగజారి రాజకీయాలు చేయాలా?. 17 లక్షల మంది ఓట్లలో ఎంత మందిని బస్సుల్లో తీసుకొస్తారు, నీచ, నికృష్ట రాజకీయాలు మానుకో, ప్రజలను అవమానపరిచే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడొద్దు. 72 ఏళ్ల వయసులో మతిస్తిమితం కొల్పోయి, సహనం కోల్పోయి, ఏం మాట్లాడుతున్నావో అర్ధం కావడం లేదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్లి పడుకుని, రెస్ట్‌ తీసుకో, రిటైర్మెంట్‌ ఏజ్‌ కూడా దాటేశావ్, టీడీపీకి 15, 16 శాతం, బీజేపీకి 5 లేదా 6 శాతం ఓట్లు వస్తాయి. ఇదీ మీ పరిస్ధితి. ఓటమిని ఒప్పుకోకుండా దరిద్రమైన నీచపు రాజకీయాలు చేస్తున్నారు.

తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలను అవమానపరుస్తున్న మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రతీ ఒక్కరికీ కూడా ధన్యవాదాలు, సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుంది కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కోరారు.
 

Back to Top