‘నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’

 
తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని వ్యాఖ్యానించిన పవన్‌ కల్యాణ్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు మంత్రి. ‘నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’ అని అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు.

పీకే అంటే పిచ్చి కుక్క అని, పవన్‌.. చంద్రబాబు జోకర్‌వి అని విమర్శించారు మంత్రి అంబటి. ఇక పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా మండిపడ్డారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుసార్లు ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అంటూ ఘాటుగా స్పందించారు. గురవారం నాటి సభలో వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రులను పవన్‌ విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయి విమర్శలు చేశారు పవన్‌. 

Back to Top