తాడేపల్లి: తప్పు చేసినవారు ఎవరైనా చట్టప్రకారం శిక్షించడం మా ప్రభుత్వ విధానమని, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా ప్రభుత్వం అదే ధోరణిలో ముందుకెళ్తుందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్యచేశాడని ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదైన కేసులో చట్టప్రకారం నిస్పక్షపాత విచారణ జరగాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేశారని, విచారణలో తేలిన అంశాలను బట్టి ఏక్షణానైనా అరెస్టు చేయొచ్చని చెప్పారు. దీనిపై చాలామంది విమర్శలు చేస్తున్నారని, నిస్పక్షపాతంగా విచారణ జరగాలని ఆదేశించిన వైయస్ జగన్ ప్రభుత్వాన్ని వాస్తవానికి మెచ్చుకోవాల్సిన అంశమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అయితే.. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని లోకేష్ అని దుయ్యబట్టారు. పప్పు నామ సార్ధకుడు లోకేష్ అని ఎద్దేవా చేశారు. అధికారం కోసం బాబూ కొడుకులు ఏడుపే ఏడుపు కార్యక్రమానికి తెరలేపారన్నారు. తెలుగుదేశం పార్టీ, దాని పాట్నర్ పార్టీ మొత్తం కట్టగట్టుకొని వచ్చినా సీఎం వైయస్ జగన్‌ను దించలేరన్నారు. మంత్రి అంబటి ఇంకా ఏం మాట్లాడారంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ నాయకుడు ఎవ్వరైనా తప్పుచేస్తే వారిని శిక్షించాల్సిందే అనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యమం చేస్తానని లోకేష్ మాట్లాడుతున్నాడు. లోకేష్ మీద 14 కేసులు పెట్టారంట.. ఏం పీకారని మాట్లాడుతున్నాడు. ఏముందని పీకుతారు నీ దగ్గర. నువ్వు ఒక మొద్దబ్బాయివి.. ఇవాళ ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశావ్. పండిత పుత్రుడివి.. పరమశుంటవి. చంద్రబాబు పండితుడా..? మోసాలు చేయడం, వెన్నుపోటు పొడవడంలో, అధికారం లాక్కోవడంలో, డబ్బులు పంచడం, సీట్లు అమ్మడం, కొనడంలో చంద్రబాబు పండితుడే. పొట్టగోస్తే అక్షరం ముక్కరాదు. అమెరికాలో చదివాడంట.. చదివాడో లేకపోతే స్విమ్మింగ్ పూల్‌లో బీరు తాగుతూ అమ్మాయిలతో తిరిగాడో.. అందరికీ తెలుసు. గంట, అరగంట అని మాట్లాడుతున్నాడు. నేను ఏదైనా అన్నాను అనుకో.. నువ్వు, మీ అమ్మ, నాన్న మీడియాను పిలిచి బావురుమని ఏడుస్తారు. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ కుటుంబం దగ్గరకు వెళ్లి మేనమామలను, మీ అమ్మగారి అక్కలు, చెల్లెలను కూర్చోబెట్టి బావురుమని ఏడుస్తారు. ఎక్కడైనా ఒక్క చోట గెలిచావా..? మంగళగిరిలో పోటీ చేశావు.. తిరనాళ్లో పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టారు. కాస్త మంచిగా మాట్లాడటం ఇప్పుడైనా నేర్చుకుంటే మంచిది. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విన్నావా..? నీ వెనకాల నిల్చున్న మీ పార్టీవారు ఏమనుకుంటున్నారో తెలుసా..? మా పార్టీకి పట్టిన శని అని అనుకుంటున్నారు. చంద్రబాబు వారసుడు అని ప్రకటించిన తరువాత మా పార్టీ మంటగలిచిపోతుందని లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్సీని చేసి.. మంత్రిని చేస్తే.. నీ ఇష్టంవచ్చినట్టుగా పరిపాలన చేసి.. పప్పు అనే మాటను సార్థకం చేసుకొని.. మంగళగిరిలో తుక్కుగా ఓడిపోయిన నువ్వు నా గురించి మాట్లాడుతున్నావ్. పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరని మాలోకం లోకేష్ తెలుసుకుంటే మంచిది. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు, దేవినేని ఉమా పదేపదే కేకలు వేశారుగా.. పూర్తిచేశారా..? కోతలు కోసి ప్రాజెక్టు పూర్తిచేయని బడుద్దాయిలు మీరు. 100సార్లు పోలవరం వెళ్లి ఏం చేశారు. కాంట్రక్టర్ల దగ్గరసంచులు మోసే సన్నాసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పని, అశాస్తీ్రయ విధానం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. సెంటర్ వాటర్ కమిషన్, డీడీఆర్‌పీ, ప్రముఖులంతా వచ్చి పరిశీలన చేశారు. డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా మరొకటి నిర్మించాలా.. దాన్నే ట్రీట్ చేయాలో అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదు. కారణం చంద్రబాబే. కాఫర్ డ్యామ్‌లు రెండూ పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేశారు. తెలుగుదేశం పార్టీ, దాని పాట్నర్ పార్టీ మొత్తం కట్టగట్టుకొని వచ్చినా సీఎం వైయస్ జగన్‌ను దించలేరు. సుపరిపాలన అందిస్తున్న నాయకుడు, తప్పుచేస్తే ఎవరినైనా శిక్షించాలని ఆదేశించే నాయకుడు. దానికి భయపడి ఏదేదో మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని లోకేష్. ఇంతవరకు ఏ ఎన్నికల్లో గెలవని ప్రబుద్ధుడు మమ్మల్ని విమర్శిస్తున్నాడు.