తాడేపల్లి: పవన్ ఎక్కాక వారాహి కాస్తా వరాహి అయ్యిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే: పవన్ ఎక్కాక వారాహి కాస్తా వరాహి అయ్యింది:* పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తూ...తన రాజకీయ ఉపన్యాసాల్లో నోటికొచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. - వారాహి అంటే అమ్మవారు అని...వారాహిని వాహనంగా చేసుకోవడం తప్పని, దానిపై ఎక్కి ప్రయాణం చేస్తే అనర్ధాలకు దారితీస్తుందని గతంలోనే చెప్పాను. - పవన్ కళ్యాణ్ ఆ రకంగా చేయడం వల్ల ఆయనకు చాలా అనర్ధాలు వస్తాయని స్పష్టంగా చెప్పా. - ఆయన సినిమాలు ఆడవని, రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా చెప్పా. - వరాహం అంటే పంది.. వారాహి అంటే శక్తివంతమైన దేవత. - ఎప్పుడైతే పవన్ వారాహి అనే దేవత పేరు చెప్పుకుని ఆ వాహనం ఎక్కడో అప్పుడు అది పంది అయిపోయిందని చెప్పా. - అంతే తప్ప అమ్మవారిని నేను దూషించడం, కించపరిచడం లేనే లేదు. - పవన్ ఆ వాహనంపైకి ఎక్కి ఊగిపోతున్నాడు.. బూతులు తిడతాడు. - కానీ ఆయన ఊగిపోతున్నాడు అని జగన్ గారు అంటే మాత్రం ఆయనకు చాలా కోపం వచ్చింది. - పల్లెటూళ్లలో పూనకాలు వచ్చి ఊగిపోయి, చిందులేస్తుంటారు... - ఇతను కూడా వారాహిపైకి ఎక్కి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. *ఆయన చెప్పు చూపించడానికి, గుండు కొట్టించుకోవడానికీ కథలుంటాయి:* - జగన్ గారు అమ్మ ఒడి కార్యక్రమంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. - ఏ సమావేశానికి వెళ్లినా ఆనవాయితీగా చివర్లో సీఎం గారు రాజకీయ వ్యాఖ్యలు ఆనవాయితీగా చేస్తున్నారు. - అమ్మ ఒడి కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. - వారాహి అనే మహాదేవత పేరు పెట్టుకుని ఇన్ని ఆబద్దాలు చెప్తున్న నిన్ను ఏమనాలి..? - ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది...ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది. - ఆయన రెండు చెప్పులు పోగొట్టుకోడానికి, చంద్రబాబుతో హైదారాబాద్ ఇంట్లో కలవడానికి, నోవాటెల్‌కు చంద్రబాబు రావడానికి ఒక కథ ఉంటుంది. - ఆయన పెళ్లి పెళ్లికీ ఒక కథ ఉంటుంది. విడాకులకీ ఒక కథ ఉంటుంది.. - మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేవన్నీ.. - సినిమాల్లో ఆయన కథానాయుడు... రాజకీయాల్లో కాకమ్మ కథలు చెప్పే కంత్రీ నాయకుడు అయ్యాడు. - ఇలా కథలు చెప్పే దుస్థితికి నేడు పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. *జగన్ గారు పోవాలనుకునే వాళ్లే.. రాష్ట్రం నుంచి పోవాలిః* - ఎందుకు జగన్ గారు పోవాలి..? ఎవరు రావాలి..? నువ్వు వస్తావా..? అంటే తెలియదు అంటావు, ఎవరు రావాలో చెప్పవు. - జగన్ గారు దిగిపోతే ఏమవుతుందో రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ? - ఒక అమ్మ ఒడి పోతుంది. ఒక విద్యా దీవెన పోతుంది.. ఒక రైతు భరోసా.. ఇలాంటి అనేకమైన పథకాలు పోతాయి. - అందుకే జగన్ గారే కావాలి... అన్ని సంక్షేమ పథకాలూ ఉండాలనేదే ప్రజల కోరిక. - జగన్ గారు పోవాలనుకునే వాళ్లే.. ఈ రాష్ట్రం నుంచి పోవాలని ప్రజలు అనుకుంటున్నారు. - చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లూ, వాకిలీ లేదు. *ఎన్నికల వరకూ హలో ఏపీ... తర్వాత ఛలో హైదరాబాద్:* - ఎన్నికల వరకూ వీళ్లు హలో ఏపీ అంటారు..ఎన్నికల తర్వాత ఛలో హైదరాబాద్ అంటారు. - వారు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వారిది గెస్ట్ హౌస్‌ల్లో జీవితం... కానీ ఇక్కడే పోటీ చేస్తారు. - హలో ఏపీ...అమ్మేశా జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పాలి. - తాను జనసేనను చంద్రబాబుకు అమ్మేశానని చెప్పాలి. - పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడు. - జ్వరం వచ్చిందని యాత్ర ఆపి, సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. - తన సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకుంటే తప్పేమీ లేదు కానీ... రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి ఎందుకయ్యా దిగజారిపోయావ్..? *గళం లేని యువగళం.. గరళంతో నిండిన పవన్ గళం:* - ఒకాయన యువగళం అంటాడు.. ఆయనకు గళమే లేదు... - యువగళానికి గళమే లేదు.. పవన్ కళ్యాణ్‌ది గరళంతో కూడుకున్న గళం. - విషం కక్కుతూనే ఉన్నాడు..జగన్ గారు పోవాలట..ఆయన మాత్రం రాడట..ఎవడో రావాలట... - ఎవరో రావడం కోసం జగన్ గారు పోవాల్సిన అవసరం లేదు. - ఈ రాష్ట్రంలో మళ్లీ మళ్లీ జగన్ గారే వస్తారు..ఈ రాష్ట్రాన్ని పరి పరిపాలన చేస్తారు. - జగన్ గారిపైనే ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు...అందుకే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ జగన్ గారిని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. - మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. - జగన్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేయడానికి, ప్రతి సామాన్యుడి కోసం, ప్రతి పేదవాడి కోసం పనిచేస్తున్న నాయకుడు. - అలాంటి నాయకుడిపై విద్వేషం చిమ్ముతూ, కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. - తాను ఓడిపోయినప్పుడు చాలా బాధ పడ్డాను అంటున్నాడు పవన్ కల్యాణ్... అంతకు ముందు తనకు ఓటమి అసలు లెక్కే కాదు అని అన్నాడు. - స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్...ఆయన్ను నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు. - ఆయన ఆవేశంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, తగాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. - ఆయన అభిమానులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. *ఈనాడు కడుపుమంట అంతా నవయుగ నుంచి కాంట్రాక్టు పోయిందనే:* - గైడ్ బండ్ కుంగింది.. దానిలో రహస్యమేముంది...? - నేను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించి కుంగిందని ఆరోజే చెప్పాను. - కానీ అది పెద్ద సీరియస్ విషయం కాదు.. నిజ నిర్ధారణ కమిటీ గైడ్‌బండ్‌ను పరిశీలించారు. - నేను వారితో మాట్లాడాను... వారు గైడ్ బండ్ కుంగటానికి గల కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. - ఇది ప్రమాదకరమైన అంశం కాదు...సరైన సమయంలో సరిచేయవచ్చని చెప్పారు. - ఈనాడు కడుపుమంట అంతా నవయుగ నుంచి పోలవరం కాంట్రాక్టు పోయిందనేదే. - తన బంధువులకు కాంట్రాక్టు లేకుండా వేరే వారికి వచ్చిందనే కడుపు మంటతో రాస్తున్న రాతలే ఇవన్నీ.. - దీనికన్నా ప్రమాదకరమైన ఘటన ఒకటి జరిగింది. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. - దాని గురించి మాత్రం ఈనాడు రామోజీ ఒక్క ముక్క కూడా రాయలేదు. - దాన్ని నవయుగ వాళ్లు చేశారు కాబట్టి ఒక్క ముక్క కూడా రాయడు. - కేంద్ర ప్రభుత్వం సీరియస్ అన్న మాట అవాస్తవం. సరిచేయాలనే ప్రయత్నంలో ఉంది. డిజైన్స్ పంపడానికి సిద్ధంగా ఉంది. *టీడీపీ వారిది బస్సు యాత్ర కాదు...తుస్సు యాత్ర:* - టీడీపీది బస్సు యాత్ర కాదు..తుస్సు యాత్ర అంటున్నారు. - వారి యాత్రకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా రావడంలేదు... - దీనికే కన్నా లక్ష్మీనారాయణ సెల్ఫీ చాలెంజ్ చేస్తున్నాడు. - అన్నా కన్నా... వస్తాదన్నా... ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నావన్నా..? - నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నావా..? - ఎక్కడున్నావో తెలియదు...ఎక్కడ ఉంటావో తెలియదు...అసలు ఉంటావో లేదో తెలియదు. - అలాంటి నీకు నాపై ఛాలెంజ్ చేసే అర్హత లేదు. - నేను మూడు ఛాలెంజ్‌లు చేస్తున్నా..వాటిని స్వీకరించమని అడుగుతున్నా. - వంగవీటి మోహన రంగా గారిని హతమార్చింది ఎవరో చెప్పు..? - నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరో చెప్పు..? - అన్నా కన్నా...చివరి వరకూ చంద్రబాబుతోనే ఉంటావా..? పార్టీ ఫిరాయిస్తావా..? చెప్పు. - అసలు ఎన్నికల వరకూ సత్తెనపల్లిలోనే ఉంటావా..? పోటీ చేయకుండా పారిపోతావా అనేది సమాధానం చెప్పు. ఆ తర్వాతే మాట్లాడితే మంచిది.