వచ్చే ఎన్నికల్లో చెప్పుకు పేడరాసి మరీ కొడతారు బాబూ..!

రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు 

 బాబుకు మిగిలింది ఇక రిటైర్మెంట్ ఒక్కటే..!

 ప్రజలు చెప్పులతో కొట్టారు కాబట్టే.. బాబు ప్రతిపక్షంలో ఉన్నాడు

 బాబు పుత్రుడిని ఒక  చోట.. దత్తపుత్రుడుని రెండు చోట్ల ప్రజలు ఓడించారు

 అధికారం పోయేటప్పటికి బాబుకు అంబేడ్కర్, సమ సమాజం గుర్తొస్తున్నాయ్.

 అధికారం పోతే అంబేడ్కర్.. అధికారంలో ఉంటే సుజనా, రాయపాటి, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు గుర్తొస్తారు.

 ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే కులాలపై బాబు మనస్తత్వమేమిటో అర్థమైంది

 25కు 25 ఎంపీ స్థానాలు మేం గెలుస్తాం.. అందుకే బాబుకు ఫ్రస్ట్రేషన్

 బాబు హయాంలో చేసిన అప్పులు తనచుట్టూ ఉండే అవినీతి మనుషులే తిన్నారు..

వైయ‌స్‌ జగన్ గారు చేసిన అప్పుల వల్ల కోటిన్నర మందికి డీబీటీ ద్వారా లబ్ధి చేకూరింది

 పోలవరంపై నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయే పిరికిపంద బాబు

 కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు మాధవ్ ఫేక్ వీడియో చుట్టే బాబు నీచ రాజకీయం.

మంత్రి అంబటి రాంబాబు

 తాడేప‌ల్లి: వచ్చే ఎన్నికల్లో చెప్పుకు పేడరాసి మరీ కొడతారు చంద్ర‌బాబూ..! అంటూ  రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చెప్పుతీయాలి, కాళ్లు తీయాలి అని మాట్లాడే చంద్రబాబు నాయుడును చెప్పులు, కాళ్లతో తన్నే రోజులు ముందు ఉన్నాయి. అహంకారం, ఫ్రస్ట్రేషన్‌తో వైయ‌స్ జగన్‌గారిని ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఇది సరైన విధానం కాదు. ఏ అంశం గురించి అయినా చర్చిద్దామని శాసనసభకు రమ్మంటే... చంద్రబాబు రాడు. ద్రౌపది ముర్ముకు ఓటు వేయడానికి మాత్రం శాసనసభకు వస్తారు. వైయ‌స్ జగన్‌గారు సభకు రానప్పుడు టీడీపీ నేతలు ఎంత నీచంగా మాట్లాడారో చూశాం. ఇవాళ శాసనసభకు రాకుండా రోడ్లమీద ఏదోదో మాట్లాడే ప్రయత్నాలు చేయడం చంద్రబాబుకు, టీడీపీకి సరైన పద్ధతి కాదని హిత‌వు ప‌లికారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

*25కు 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం*
        ఈమధ్య కాలంలో జాతీయ స్థాయిలో మూడో, నాలుగు సర్వేలు వచ్చాయి. అవి దేశవ్యాప్తంగా సర్వే చేసి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయి. ఆ సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్‌ స్థానాల్లో 18 నుంచి 23 సీట్లు వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో ఉన్న వైయస్సార్‌ సీపీ గెలిచే అవకాశం ఉందని, కేవలం 2 -3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చాలా కుండబద్దలు కొట్టేలా చెప్పాయి. ఆ సర్వేలను నేను చూశాను. అయితే అవి పూర్తి వాస్తవాలుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే, గడప గడప కార్యక్రమానికి నేను కూడా వెళుతున్నాను, ప్రజల మధ్య తిరుగుతున్నాను. 23 సీట్లే కాదు 25 పార్లమెంటు సీట్లను కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తెలివి తక్కువవాడు కాదు. ఆయనకు సర్వేలు చేయించుకునే అలవాటు ఉంది. ప్రజల నాడి కాస్తోకూస్తో పట్టుకోగలడు కానీ ప్రజలకు చెప్పడు. ఎందుకంటున్నానంటే గత ఎన్నికల్లో... మేము అధికారంలోకి వచ్చేముందు చంద్రబాబు నూటికి 150 పాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని గప్పాలు పలికారు. ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ కూడా... జరగబోయే 2024 ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు, తన పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని తెలిసి ఫ్రస్టేషన్‌లో తీవ్రమైన పదజాలంతో  ఏదేదో మాట్లాడేస్తున్నారు. 

*బాబుకు రిటైర్మెంట్ ఒక్కటే మార్గం*
        చంద్రబాబు వయసు 75 ఏళ్ళు. వాళ్ల అబ్బాయిని మొన్న అసెంబ్లీకి రాకుండా ఓడించారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు  అసెంబ్లీకి అడుగుపెట్టాలని రెండుచోట్ల పోటీ చేశారు. రెండుచోట్లా ఓడించారు. ఇది వాళ్ల ట్రాక్‌ రికార్డు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేలు చెప్పినట్లు వైయస్సార్‌సీపీ విజయం సాధించి, చంద్రబాబు ఓడిపోతే రిటైర్మెంట్‌ తప్ప మరో మార్గమే లేదని తెలిసిన తర్వాత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

*అధికారం పోయాక బాబుకు అంబేడ్కరిజం గుర్తొస్తుంది*
         చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 14ఏళ్లు పాలన చేశారు. ఆయన 44 ఏళ్ల రాజకీయ జీవితంలో హఠాత్తుగా సమసమాజం, అంబేద్కరిజం గుర్తుకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఈవేమీ గుర్తుకురాలేదు. టీడీపీ హయాంలో ఆలయ కమిటీల్లోనూ, మార్కెట్‌ యార్డుల్లోనూ, కార్పొరేషన్లలోనూ, వివిధ కార్పొరేషన్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే జ్ఞానమే ఆయనకు లేదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు చంద్రబాబుకు గుర్తుంటారు. అదే అధికారం పోయేసరికి అంబేద్కర్‌గారి ఆశయాలు, సమసమాజం గుర్తుకు వస్తున్నాయి. 

*కులాల పట్ల బాబు మనస్తత్వం ఇది*
    చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఒక్కమాటతోనే కులాల పట్ల ఆయనకు ఉన్న అవగాహన, అభిప్రాయం, ఆయన మనస్తత్వం ఏంటో చాలా స్పష్టంగా అర్థం అయింది. ఈ విషయాన్ని ప్రజలు  ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడారంటే ఆయన ఉద్దేశం, ఆయన కుల అహంకారం, కులాల పట్ల ఆయన మనస్తత్వం ఏంటో అర్థం అవుతుంది. అన్నం అంతా పట్టుకుని చూడాలా? ఒక్క మెతుకు చాలదా.. అలాగే ఆ ఒక్క మాటను బట్టి చంద్రబాబుకు కులాల పట్ల ఏ భావన ఉందో తెలుస్తుంది. అగ్ర కుల అహంకారంతో పరిపాలన చేసిన పెద్దమనిషి. అలాంటి ఆయన ఇవాళ కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

- తానేప్పుడు కులాలను చూడలేదు సేవకుడిగా పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. వారేవా చంద్రబాబు ఈ మాటలు మాట్లాడటమా? కులాలు చూడకుండా ప్రజా సేవకుడిగా పనిచేశానని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అంతరాత్మ ఘోషించడం లేదా? అదేమంటే కులం పేరుతో చెప్పు తీసుకొని కొట్టాలని అంటున్నాడు... అందుకే ప్రజలు చెప్పు తీసుకుని కొట్టి 23 సీట్లకే పరిమితం చేశారు. కులహంకారంతో పరిపాలన చేసిన చంద్రబాబుకు పుట్టగతలు లేకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చెప్పుకు పేడ రాసి మరీ కొడతారు. 

*బాబు చుట్టూ ఉన్నవారు అవినీతిపరులు తినేశారు*
         ముఖ్యమంత్రిగారు అప్పులు చేస్తున్నారంటూ చంద్రబాబు తెగ మాట్లాడుతున్నాడు. మరి మీ పాలనలోనూ అప్పులు చేశారు కదా. మీరు చేసిన అప్పులు మీ చుట్టూ ఉన్న అవినీతిపరులు తినేశారు.  మీ దగ్గర ఉన్న సుజనా చౌదరి, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడులు తిన్నారు. ఈ కుటుంబాలన్నీఅవినీతితో మోసేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు కూడా అప్పు చేశారు. ఎవరు తింటున్నారు. ఆ అప్పు చేయడం వల్ల రాష్ట్రంలోని 1కోటి 50లక్షల కుటుంబాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఇలాంటి విషయాలు గురించి చంద్రబాబు మాట్లాడడు. 

*పోలవరంపై ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి*
        పోలవరం ప్రాజెక్ట్‌ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీని పదేపదే అడుగుతుంటే.. వారు పారిపోతున్నారు. 14ఏళ్ల ముఖ్యమంత్రి జీవితం, 44రాజకీయ జీవితం అని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు కదా. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయే పిరికిపంద చంద్రబాబు నాయుడు. 
        1- విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయితే నువ్వెందుకు తీసుకున్నావు? తప్పా- రైటా? 
        2- కేంద్రం నిర్మిస్తే ఆలస్యం అవుతుందని వంక చెప్పావు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే త్వరగా అవుతుందని చెప్పావు. మరి, 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుందని చెప్పిన నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావో చెప్పాలి.
        3- కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రం వాల్‌ కట్టినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రం వాల్‌ వేయాల్సి వచ్చినప్పుడు కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రం వాల్‌ చేపడతారు. కాని దురదృష్టవశాత్తు ఎందుకు కట్టారో చెప్పలేని పరిస్థితిలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఉంది.
-  ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు, రామోజీరావు తప్పుడు మాటలు మాట్లాడుతూ... వాళ్లు చేసిన తప్పిదాలను మామీద రుద్దాలనే తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

*అందుకే రామోజీకి కడుపు మంట*
          రోజు పుంఖాను పుంఖాలుగా ఫ్రంట్‌ పేజీలో ఈనాడు దినపత్రికలో పోలవరంపై వార్తలు రాస్తుంటారు.  ఆయన బంధువువైన నవయుగ సంస్థ నుంచి కాంట్రాక్ట్‌ను తీసేసుకుని మెగా వాళ్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చామని రామోజీరావుకు కడుపుమంట వేరు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మెగా సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చి,  800 కోట్ల రూపాయిలు మేరకు, అంటే, 12.6 శాతం లాభం ప్రభుత్వానికి వచ్చింది. దీనికి కాంట్రాక్టరును మార్చేశారని చంద్రబాబు నాయుడు, రామోజీరావుగారు పదేపదే మాట్లాడుతున్నారు. బంధుప్రీతితో లక్షల కోట్లు కాజేద్దామని పథకం ప్రకారం  నాడు నవయుగ సంస్థకు పోలవరం కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేసి నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఎందుకిచ్చారని చంద్రబాబు నాయుడును సూటిగా అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పరు. 
- వాళ్లేమో నామినేషన్‌ మీద టెండర్ ఇస్తే... మేము టెండర్‌ ప్రకారం మార్చాం, ఏది చట్టబద్ధత అంటే దానిగురించి మాత్రం రామోజీరావు చెప్పడు. తన వియ్యంకుడికి కాంట్రాక్ట్‌ ఇవ్వలేదు కాబట్టి పోలవరం నాశనం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారు. పోలవరం సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు  అంటున్నాడు. పోలవరం సర్వనాశనం కావాలనుకునే దుర్మార్గుడు చంద్రబాబు.  ప్రాజెక్ట్‌ నాశనం కావాలని బాబు కోనసీమలో ఉండే కొబ్బరికాయలు అన్నీ కొడుతున్నాడు. 
- ఎందుకంటే జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి చెడ్డపేరు రావాలని ఈ ప్రయత్నాలు అన్నీ. పోలవరం ప్రాజెక్ట్‌ను నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే, దానిని బాగు చేయాలనే తాపత్రయంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. 

*మార్ఫింగ్ వీడియో పట్టుకుని నీచ రాజకీయమా..?*
    ఎంపీ మాధవ్‌ వ్యవహారాన్ని పట్టుకుని ఇంకా ఇంకా లాగుతూ ఉన్నారు. ఒక అసభ్యకరమైన, మార్ఫింగ్‌ వీడియోను పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు చంద్రబాబు రాజకీయం అంతా దాని చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో ఇకేమీ సమస్యలు లేవా? మాధవ్‌ను చూశారా? ఎంత ఘోరం అని చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు. బాబుకు బుద్ధి, జ్ఞానం ఉందా? రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేవా? వాటిని మానేసి ఈ ఫేక్‌ వీడియో మీద మాట్లాడటమా?.
-  కారణం ఏమిటంటే అసమర్థుడికి కోపం ఎక్కువ. మార్ఫింగ్‌ చేసి ఏదోవిధంగా తప్పుడు ప్రచారం చేయాలని ఆయన ప్రయత్నం, ఆరాటం. ఎవరైనా నీచమైన అస్త్రాలు వేస్తారా? ఇలాంటి నీచ ప్రయత్నాలు చేసి, వారికి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియాలో వాటిని ప్రసారం చేయడం, ఆ మూడు చానల్స్‌లో ఇదే ప్రపంచం అన్నట్లుగా డిబేట్‌లు, చర్చలు పెట్టి మాట్లాడం దుర్మార్గమైన రాజకీయం. ఇలాంటి ఆలోచన చేస్తున్న చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని చెప్పదలచుకున్నాను. 
    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top