తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టుపై పచ్చ పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరం విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు. పోలవరంపై ఈనాడు పత్రిక అసత్య కథనాలను మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దుష్టచతుష్టయంలో అగ్రగామి: దుష్టచతుష్టయంలో అగ్రగామిగా నిల్చే ఈనాడు పత్రిక. రోజూ ఏదో ఒక కథనం ప్రచురిస్తోంది. నిన్న పోలవరం ప్రాజెక్టు పనులపై కథనం రాశారు. పనులు సాగడం లేదని, ఎవరిది ఈ వైఫల్యం అంటూ అందులో ప్రశ్నించారు. ఇంకా ఏదేదో చాలా రాశారు. రామోజీరావు పత్రికలో ప్రతి రోజూ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక వార్తను వండి వారుస్తున్నారు. విషం కక్కి విషపూరిత రాతలు రాస్తున్నారు. జర్నలిజమ్ అనేది వాస్తవాలు చెప్పాలి. అంతే కానీ చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి విషం కక్కుతూ, వార్తలు రాస్తున్నారు. అందుకే మేము కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు చెబుతాం. ఆ బాధ్యత మాకు ఉన్నది. అందుకే కొన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేస్తున్నాం. చంద్రబాబుకు రాజగురువు: రామోజీరావుగారు ఎందుకు ఈ స్థాయిలో విషం కక్కుతూ రాస్తున్నారు అంటే, ఆయనకు టీడీపీకీ మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలుసు. ఆయన చంద్రబాబుకు రాజగురువు. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అయితే, అసలైన అధ్యక్షుడు రామోజీరావు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే ఎంపిక చేస్తున్నారు. చివరకు చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరుండాలనేది కూడా రామోజీరావు సలహా మీదనే జరుగుతుంది. మంత్రివర్గాన్ని విస్తరించాలన్నా, మార్చాలన్నా రాజగురు రామోజీరావుదే పాత్ర. సొంత ఆస్తిలా తెలుగుదేశం: ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావుకు ఫిల్మ్ సిటీ ఎలా సొంత ఆస్తో.. అంతే సొంత ఆస్తిలాగా తెలుగుదేశం పార్టీ మారింది. ఎన్టీ రామారావును పదవి నుంచి దింపిన నాటి నుంచి ఆ పార్టీ రామోజీరావు సొంత ఆస్తిలా మారింది. ఎన్టీరామారావు ముక్కుసూటిగా పోయే వ్యక్తి. ప్రజల్లో ఉండేవారు. వారినే నమ్ముకున్నారు. అందుకే రామోజీరావును లెక్క చేయకపోవడంతో, ఆయన ఎన్టీ రామారావు మీద కక్ష కట్టి, కుట్ర చేసి ఆయనను పదవి నుంచి దింపేశారు. అందులో రామోజీపాత్ర అందరికీ తెలుసు. రామోజీరావు – డీపీటీ పథకం: ఎన్టీ రామారావుపై కుట్ర చేసి పదవి నుంచి దింపిన రామోజీరావు.. ప్రజాబలం లేని, ప్రజామోదం లేని, మాస్ లీడర్ కాని చంద్రబాబును గద్దెను ఎక్కించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే డీపీటీ (దోచుకో.పంచుకో.తినుకో) అనే పథకాన్ని రామోజీరావు యథేచ్ఛగా సాగించారు. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. రామోజీ అక్కసుకు మరో కారణం: చంద్రబాబు అధికారంలో లేడని, జగన్‌గారు సీఎం పదవిలో ఉన్నారన్న కోపంతో పాటు, మరో కారణం వల్ల పదే పదే పోలవరం ప్రాజెక్టుపై రాస్తున్నారు. నవయుగ కంపెనీ. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌టాయ్ కంపెనీ దక్కించుకుంటే, చంద్రబాబు అధికారంలోకి రాగానే నామినేషన్ విధానంలో, ఎలాంటి టెండర్లు లేకుండా రామోజీరావు కొడుకు వియ్యంకుడైన నవయుగ కంపెనీకి ఏకంగా రూ.3302 కోట్ల ఆ ప్రాజెక్టు పనుల కాంట్రాక్ట్‌ను అప్పగించారు. ఆ విధంగా డీపీటీ మొదలైంది. నవయుగ పంచుకో. రామోజీ దోచుకో. చంద్రబాబు, రామోజీరావు పంచుకో. ప్రపంచంలోనే అదో పెద్ద స్కామ్: ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్, రూ.3300 కోట్లకు పైగా ప్రాజెక్టును నామినేషన్ విధానంలో నవయుగకు ఇచ్చారు. జగన్‌గారు సీఎం కాగానే, దానిపై వివరాలు సేకరించి మళ్లీ టెండర్లు పిల్చారు. 12.6 శాతం లెస్‌కు రూ.820 కోట్ల లాభం జరిగే విధంగా ఎంఈఐఎల్‌కు ఇచ్చారు. దీంతో రామోజీరావుకు కడుపు మంట. అందుకే ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. మళ్లీ ప్రశ్నిస్తున్నాను. జవాబు చెబుతారా?: నేను గతంలో మూడు ప్రశ్నలు వేశాను. వాటికి రామోజీరావు కానీ, చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేదు. మళ్లీ అడుగుతున్నాను. ఇప్పుడైనా జవాబు చెబుతారా? – మీరు పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రం నుంచి ఎందుకు తీసుకున్నావు? – 2018 నాటికే పనులు పూర్తి చేస్తామన్నారు. కానీ ఎందుకు చేయలేకపోయారు?. – ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ పునాదులు అయినటు వంటి డయాఫ్రమ్ వాల్ నిర్మించారే. ఇది తప్పు కాదా? మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజమ్ అంటూ కధనాలు రాస్తున్నారు కదా. వీటిని ఎందుకు రాయడం లేదు రామోజీరావుగారూ? ఒక దుగ్ధ. ఒక కక్ష: పోలవరం మీద విషం కక్కుతూ రాతలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, వారి మనసులను విషపూరితం చేయాలని రామోజీరావు ప్రయత్నం. ఒక దుగ్ద. ఒక కక్షతో ఈ పని చేస్తున్నారు. రామోజీ–వైట్ కాలర్ క్రిమినల్: ఇక రెండో అంశం. మార్గదర్శి ఫైనాన్స్. డిపాజిట్ల సేకరణ. దక్షిణ భారత్‌లోనే చాలా ఆస్తిపరుడు. ఆయనకు పలు వ్యాపారాలు. అంత పెద్ద దిగ్గజం ఎలా అయ్యాడు?. అది అందరికీ తెలుసు. చట్టాలను అతిక్రమించి, వ్యాపారాలు చేసినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారం స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబ«ంధనలు అతిక్రమించి, రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా ప్రజల నుంచి రూ.2600 కోట్ల డిపాజిట్లు సేకరించారు. దీనిపై వైయస్సార్‌గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా కధ నడిచింది. మార్గదర్శి వ్యవహారంపై ఆనాడు ఎంపీగా ఉన్న అరుణ్‌కుమార్ ప్రశ్నించాడు. ఆర్బీఐ అనుమతి లేకుండా మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద ఆర్థిక వ్యాపారం చేస్తోందని ఆనాడు అరుణ్‌కుమార్‌గారు ఫిర్యాదు చేస్తే, మీడియా మీద దాడి చేస్తున్నారని నిందించారు. అయితే మీడియా ముసుగులో చేస్తున్న ఈ అక్రమ వ్యవహారంపై ఆనాడు వైయస్సార్‌గారి హయాంలో సమగ్ర దర్యాప్తు తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. 540 బై 2008 కేసు నమోదు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా: ఆ తర్వాత చాలా జరిగాయి. వైయస్సార్‌గారు చనిపోయారు. దీంతో చాలా విచిత్రాలు జరిగాయి. మూడో కంటికి తెలియకుండా ఆ కేసును కొట్టేశారు. అది ఎప్పుడు జరిగిందంటే.. రాష్ట్ర విభజన తర్వాత డిసెంబరు 30, 2018న ఉమ్మడి హైకోర్టును కూడా విభజించారు. అదే రోజున రామోజీరావుగారిపై ఉన్న కేసును మూడో కంటికి తెలియకుండా, సింగిల్ జడ్జీ జస్టిస్ రజనీగారు, ఆ కేసును కొట్టేశారు. ఇది చాలా కాలం ఎవరికీ తెలియదు. ఏ పత్రికలోనూ రాలేదు. మరి ఎలా జరిగింది? సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: దీన్ని చాలా రోజుల తర్వాత అరుణ్‌కుమార్‌గారు తెలుసుకుని, సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేశారు. దీంతో కొన్ని వారాల క్రితం రామోజీరావుగారి న్యాయవాది సుప్రీంకోర్టులో సీజేఐ బెంచ్ ముందు వాదించారు. ఆ కేసును త్వరగా విచారణకు తీసుకురావాలని కోరారు. ఆ తర్వాత ఆ కేసును వాయిదా వేశారు. ఆ కేసు వాయిదా తర్వాత, ఏపీ ప్రభుత్వం తాము కూడా ఎస్‌ఎల్‌పీ ఫైల్ చేస్తామని చెప్పడంతో, ఆ కేసును కొట్టేయకుండా ఆపారు. దీంతో రామోజీరావుకు మళ్లీ కడుపు మంట. మళ్లీ కడుపు మంట: తాను హైకోర్టులో ఎవరికీ తెలియకుండా కేసును కొట్టేయించుకుంటే, జగన్‌గారి ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేస్తామని, దాన్ని సుప్రీంకోర్టులో కొట్టేయకుండా చూసిందని రామోజీరావుకు కోపం. కడపు మంట. ఇన్ని బాధల మధ్య విషం కక్కుతున్నారు. రామోజీరావుగారు చట్టాలను వ్యతిరేకించిన వైట్ కాలర్ క్రిమినల్ కాదా? చెప్పండి. హెచ్‌యూఎఫ్ కింద రూ.2600 కోట్ల డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్స్‌ను ఆయన నష్టాల్లో చూపారు. అన్నింటిలో లాభాలు చూపారు. అదే అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. జైలుకూ పంపారు. కానీ రామోజీరావు ఎన్ని నేరాలైనా చేయొచ్చు. ఆయనకు చట్టాలు వర్తించవు. ఎందుకంటే ఆయన రాజగురువు. కోర్టుకు రాకుండా తప్పుకోవచ్చు. ఇన్ని దుర్మార్గాలు చేసిన రామోజీరావుపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తే, ఓర్చుకోలేక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో పాటు, జగన్‌గారు తనపై చట్టపరంగా చర్యలకు సిద్ధం అవుతున్నారని తెలియడంతో విషం కక్కుతున్నారు. జగన్‌గారు ప్రజల మనిషి: ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. రామోజీరావు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా, ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, జగన్‌గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన వెన్నుపోటుతో సీఎం కాలేదు. మేనేజ్ చేసి, మోసం చేసి పదవులు పొందలేదు. వైయస్సార్‌గారి మరణం తర్వాత చాలా కష్టాలు పడ్డారు. అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టినా తట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లారు. వారితో మమేకం అయ్యారు. 175 సీట్లకు పోటీ చేసి, ఒంటిచేత్తో 151 సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చారు. దుష్ట చతుష్టయంలో నెంబర్ వన్ చంద్రబాబునాయుడు, నెంబర్ 2 రామోజీరావు, నెంబర్ 3 రాధాకృష్ణ, నెంబర్ 4 టీవీ5 నాయుడు. ఇంకా వీరి దత్తపుత్రుడు అందరూ కలిసికట్టుగా వచ్చినా, ఎన్ని కుళ్లురాతలు రాసినా, జగన్‌గారి ఎడమకాలి చిటికెన వేలు గోరు కూడా టచ్ చేయలేరు. రామోజీరావుగారూ రాసుకొండి: అత్యంత ధనవంతుడు, రాజగురువుగా చెప్పబడుతున్న శ్రీశ్రీశ్రీ చెరుకూరి రామోజీరావుగారికి మరోసారి చెబుతున్నా.. మీ ఆరాటమే తప్ప ప్రయోజనం లేదు. అక్క ఆరాటమే. బావ బతికే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఎన్ని విషపు రాతలు రాసినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా, కక్కినా ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో సర్వసన్నధ్ధమైందనే విషయాన్ని గమనించండి. ఎందరు ఏమి చేసినా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసేది జగన్‌గారే. ఇది రాసుకొండి. ఫ్రంట్ పేజీలో రాసుకుంటావో. బ్యాక్ పేజీలో రాసుకుంటావో. నీ ఇష్టం. మరోసారి చెబుతున్నాను. రామోజీరావు ఒక వైట్ కాలర్ క్రిమినల్. తన ఆటలు సాగడం లేదనే ఈ కుట్రలు. కుతంత్రాలు.