విశాఖపట్నం: మాజీ మంత్రి హరిరామ జోగయ్యకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సూటి ప్రశ్న సంధిస్తూ ఓ లేఖ రాశారు. ‘‘గౌరవనీయులైన హరిరామ జోగయ్య గార్కి.. వంగవీటి మోహనరంగా గారిని చంపించినది చంద్రబాబు నాయడే అని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.. అలాంటి చంద్రబాబు నాయుడితో పొత్తులకు సిద్ధమైన పవన్ కల్యాణ్‌ను మీరు సమర్థిస్తారా..? స్పష్టం చేయగలరు’’ అంటూ హరిరామ జోగయ్యకు మంత్రి అమర్‌నాథ్ లేఖ రాశారు.