ఒక్క నోటీసుతో చంద్రబాబుకు ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏముంది?

మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: సీఐడీ అధికారులు ఇచ్చిన ఒక్క నోటీసుతో చంద్రబాబు ప్రాణాలకు వచ్చిన ఏముందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు భద్రత విషయంలో కేంద్రం కల్పించుకోవాలనడం హాస్యాస్పదమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎన్నెన్నో అక్రమాలు చేసి దళిత భూములను కొట్టేశారని మంత్రి విమర్శించారు. రాజధానిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కాజేశారని ఆయన మండిపడ్డారు. ఆనాడే రాజధానిలో జరిగిన అక్రమాలపై మేం ప్రశ్నించామని తెలిపారు. రాజధాని పేరుతో మీ సొంతవారికి బూములు ఎలా కాజేశారో అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు విచారణకు సహరిస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయన్నారు. దళిత భూములను కాజేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది  లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు.
 

తాజా ఫోటోలు

Back to Top