ప్రకాశం: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మత్స్యకారులను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో 12 వేల మత్స్యకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10 వేల భృతి అందిందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన మత్స్యకారులను కించపరిచేలా మాట్లాడిన నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. కానీ, సీఎం వైయస్ జగన్ మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని రకాలు చర్యలు చేపడుతున్నారని వివరించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా మత్స్యకారులకు ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.