ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన మంత్రి సురేష్‌

కృష్ణా జిల్లాః నూజివీడు ట్రిపుల్ ఐటీని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ సందర్శించారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ లకు 2019  అడ్మిషన్లు ప్రక్రియను ప్రారంభించి ఎంపికైన విద్యార్థులకు ఐడి కార్డులు అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, ఛాన్సలర్ కేసీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కేఎన్. చంద్రారెడ్డి, డైరెక్టర్లు సూర్యచంద్రరావు, హర శ్రీరాములు పాల్గొన్నారు.
 

Back to Top