జూనియర్‌ కాలేజీలను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తెస్తున్నాం

గత పాలనలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు 

టీడీపీ పాలనలో విద్యను లాభదాయకంగా చూశారు

రాబోయే రోజుల్లో జూనియర్‌ కాలేజీల్లో విద్యను మెరుగుపరుస్తాం

ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ బిల్లుకు ఆమోదం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అసెంబ్లీ: జూనియర్‌ కాలేజీలను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తెస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ అమెన్‌మెంట్‌ బిల్లు 2019 కు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ..ఈ సభ ద్వారా మనం చట్టం చేసుకున్నాం.  ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ చట్టం చేసుకున్నాం. 1 నుంచి 10వ తరగతి వరకు నియంత్రణ, పర్యవేక్షణకు చట్టం చేసుకున్నాం. ప్రైవేట్‌ సంస్థలు నడుపుతున్న సంస్థల్లో విలువలు, మౌలిక సదుపాయాలు కరువు కావడంతో రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్పొరేటికరణ, వాణిజ్యపరంగా విద్యను లాభదాయకం చేస్తూ ఎంసెట్‌, నీట్‌ అంటూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేటికరణతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు విఫరీతంగా నష్టపోతున్నాయి.విద్యార్థుల మైండ్‌సెట్‌ మారిపోతోంది. జూనియర్‌ కాలేజీలను నియంత్రించాలని కోరుతూ సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 3339 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. 2014 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. 124 ఎయిడెడ్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. లక్ష, లక్షన్నర, రెండు లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. రకరకాల బోర్డులు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ బోర్డులన్నింటిని తీసేలా చర్యలు తీసుకున్నాం. మీ కాలేజీ కోడ్‌ ఏంటి? ఎప్పటి నుంచి స్థాపించారు. మీ కాలేజీలో ఉన్న కోర్సులు ఏంటన్నది బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ 2019 ఏర్పాటు చేశాం. దీనికి రిటైర్డు హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాంతారావు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కార్యాకలాపాలు ప్రారంభించాం. రాబోయే రోజుల్లో కచ్చితంగా గుణాత్మకమైన విద్యను అందిస్తాం. ఈ కమిషన్‌ పరిధిలోకి జూనియర్‌ కాలేజీలు తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ కాబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి ప్రోరోగ్‌ చేయడం, సమస్య లేనందున వెంటనే పాఠశాల విద్యా క్రమబద్దీకరణకు అక్టోబర్‌ 30న ఒక ఆర్డినెన్స్‌ తీసుకురావడం జరిగింది. ఈ విషయం కూడా సభ దృష్టికి తీసుకువచ్చాం. ఈ రోజు ఈ బిల్లును సవరణ చేస్తూ స్కూల్‌తో పాటు జూనియర్‌ కాలేజీలను ఈ చట్టంలోకి తీసుకువస్తున్నాం. ఈ చట్టాన్ని పటిష్టం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జూనియర్‌ కాలేజీలను మరింత మెరుగు పరుస్తాం. విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్‌ స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్‌ స్కూళ్లలో పుస్తకాల వ్యాపారం చేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఫీజులు నియంత్రిస్తూ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ బిల్లుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆమోదం తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top