కార్మికులకు వైఎస్‌ జగన్‌ మే డే శుభాకాంక్షలు

 హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సోదరులకు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లిన కార్మిక సోదరులకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక రథం కదులుతోందన్నా, ఆర్థిక వ్యవస్థ సవ్యంగా నడుస్తోందన్నా అది కార్మికులు స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలనే ధారపోయటం వల్ల సాధ్యమవుతోందని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంలో కార్మిక సోదరుల సంక్షేమం కోసం పథకాలు రచించటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన దేశంలోనే సువర్ణ అధ్యాయమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్మికుల పక్షపాతిగా వైఎస్సార్‌ కాంగ్రెస్, వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు అన్ని విధాలా పాటుపడుతుందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 
జేఈఈ ర్యాంకర్లకు జగన్‌ శుభాకాంక్షలు
జేఈఈలో ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘జేఈఈ ర్యాంకర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడం గర్వకారణం. భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

Back to Top