టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలోకి భారీగా చేరిక‌లు

నెల్లూరు:  ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత చంద్ర‌బాబు తీరుతో విసుగు చెందిన ఆ పార్టీ శ్రేణులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, మాజీ జెడ్పిటిసి సభ్యుడు, ప్రముఖ బీసీ నాయకుడు రాచాల రవికుమార్ యాదవ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వచ్చిన ప్రజల సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మాజీ నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి , గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, స్థానిక వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.

Back to Top