రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైయ‌స్ జగన్‌తోనే..  

మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

 గుంటూరు:  రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగుతా.. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవరూ నన్ను దూరం చేయలేర‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(ఆర్కే) పేర్కొన్నారు.  కీలక సమావేశానికి గైర్హాజరు కావడంతో తనపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఆర్కే కొట్టిపాడేశారు.  

మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఉంది.  పంటికి సర్జరీతో పాటు ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల మీటింగ్‌కి వెళ్లలేకపోయా. దానికి ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి రాతలు రాసింది. ఒక వర్గం మీడియా పనికట్టుకుని విష ప్రచారం చేసింది. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చులు పెట్టి మనిషి మనిషిని విడదీసి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడ‌ని మండిపడ్డారు. 

అసలు చంద్రబాబు మీటింగ్ పెడితే ఎవరెవరు వచ్చారో.. ఎవరెవరు రాలేదో యెల్లో మీడియా ఎందుకు రాయదు. గత ప్రభుత్వంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఏనాడైనా మంగళగిరి మున్సిపల్ సమావేశానికి వచ్చాడా?. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చాడా?.  మరి లోకేష్ గురించి ఎందుకు ఎల్లో మీడియా ప్రస్తావించలేదు? అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు-ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా వైయ‌స్ జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని, మంగళగిరిలో మళ్లీ గెలిచేది వైయ‌స్ఆర్‌సీపీనే అని ఎమ్మెల్యే  ఆర్కే  ఘంటా పథంగా చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top