తాడేపల్లి: బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కృషి చేసిందని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. - తెలుగుదేశం పార్టీ కంటే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే బ్రాహ్మణులకు మేలు చేసిందని చెప్పారు. 175 అసెంబ్లీ స్దానాలలో ఒక్క స్దానం కూడా టిడిపి బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని పచ్చమీడియా ఎందుకు హైలెట్ చేయడం లేదని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. అర్చకులకు వంశపారపర్యహక్కులను వైయస్సార్ సిపి ప్రభుత్వం పునరుద్దరించింది.11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసింది. - 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం అర్చకుల గౌరవవేతనం 1,105 మందికి 21 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4,346 మందికి గౌరవ వేతనం పెంచి 62 కోట్ల రూపాయలను అందించింది. - ధూపదీప నైవేద్యం 1621 ఆలయాలను 81 లక్షలు మాత్రమే టిడిపి హయాంలో పెంచారు.వైయస్సార్ సిపి ప్రభుత్వం 5,338 దేవాలయాలకు 2.66 కోట్ల రూపాయలకు పెంచారు. - ఏపిలో జగన్ గారి ప్రభుత్వం వచ్చాక అర్చకులకు,పురోహితులకు గృహనిర్మాణం,ఆరోగ్యం,వైద్యం కాని మూడు అంశాలలో శాచ్యురేషన్ పద్దతిలో పధకాలను అందించారు. - శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయలతో 851 దేవాలయాలు మాత్రమే నిర్మించగా, వైయస్సార్ సిపి ప్రభుత్వం హయాంలో 1683 కోట్ల రూపాయలతో3,958 దేవాలయాలను నిర్మించడానికి వెచ్చించారు. - హిందూ దేవాలయాల పట్ల,హిందూ సంప్రదాయాలపట్ల,అర్చకుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి,జగన్ గారి ప్రభుత్వానికి ఏ రకమైన వ్యత్యాసం ఉందో గమనించాలి. -కరోనా విపత్తు వచ్చినప్పుడు రాష్ర్టంలో దేవాలయాలన్ని మూసి వేసినప్పుడు దేవాలయ శాఖ ద్వారా ఆన్ లైన్ లో 31,017 మంది అర్చకులకి 15 కోట్ల రూపాయలు అందించింది. - టిటిడి దేవస్దానం లో హిందూ ధర్మవ్యాప్తి కోసం హిందూ ఘనాపాటిలకు వేతనాలు పెంచారు. వృద్దపండితులుకు,వితంతువులకు పెంచడం జరిగింది.వేదపారాయణ సంభావనాదారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైయస్సార్ సిపి ప్రభుత్వం అండగా నిలిచింది. -బ్రాహ్మణ సామాజిక వర్గానికి 1,31,184 మందికి 780 కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలలో జగన్ గారి ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 50 వేలమందికి 260 కోట్లు మాత్రమే అందించింది. - బ్రాహ్మణ,అర్చక వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది టిడిపి హయాంలోనే అనేది అందరికి తెలుసు. - వాస్తవాలు ఇలా ఉంటే పచ్చమీడియా,టిడిపి నేతలు మీడియా,ఛానల్స్ ఉన్నాయి కదా అని దుష్ప్రచారం చేస్తే వాటిని నమ్మే స్దితిలో బ్రాహ్మణసామాజిక వర్గం లేదనేది గుర్తించాలని అన్నారు. - ఎన్నికల సమయంలోనే కాకుండా సంవత్సరం క్రితమే విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక చండీరుద్ర రాజశామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీమహా యాగాన్ని ఏ ప్రభుత్వం చేయలేదు.అర్చక స్వాములు,గురువులు,ప్రజలు,స్వామీజీలు సకాలంలో వర్షాలు పడాలి.ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్న ప్రభుత్వం వైయస్సార్సిపి ప్రభుత్వం అన్నారు. -ఏ అంశంలో కూడా ఈ ఐదేళ్లలో బ్రహ్మాండమైన పధకాలు బ్రాహ్మణసామాజిక వర్గాలకు అందాయి. పచ్చమీడియా ద్వారా ఎంతగా దుష్ప్రచారం చేసినా వాటిని అర్చక,బ్రాహ్మణులు ఎవ్వరూ నమ్మద్దని విజ్ఞప్తి చేశారు.