వైఫల్యాలు ఎండగడితే టీడీపీకి ఎంతకంత ఉలికిపాటు..?

జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు
 

రైతు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పారిపోయారు
 

40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ఎక్కడికెళ్ళింది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి 

అమరావతి: గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టడం సరికాదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి  గోవర్థన్‌ రెడ్డి అన్నారు.ఐదేళ్లలో గత ప్రభుత్వం అధికారాన్ని,నిధులను దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు.మేం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చు విధంగా ముందుకెళ్తున్నామన్నారు.ఏపీ ప్రత్యేకహోదాపై చంద్రబాబు అనేక సార్లు యూటర్న్‌ తీసుకున్నారన్నారు.తమ స్వార్థం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాల తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరుకు హోదా కోసం వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారన్నారు.ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు.అభివృద్ధి  కాకుండా అవినీతి ఏపీగా చంద్రబాబు మార్చారని దుయ్యబట్టారు.టెండర్లలో అవినీతి ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే జ్యూడీషియల్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

పోలవరంలో ఇష్టారాజ్యంగా టీడీపీ అంచనాలు పెంచిందన్నారు.జన్మభూమి కమిటీలతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారన్నారు.గత ఐదేళ్లలో దౌర్భాగ్యమైన పాలనను ప్రజలు చూశారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ విధానమని తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వం  రేషన్‌ సరుకులు కూడా సరిగ్గా ఇవ్వలేదన్నారు. రైతుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవా? లేక చంద్రబాబు సుఖీభవా? అనేది అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.

ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్న మహానేత వైయస్‌ఆర్‌ అని తెలిపారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా వైయస్‌ఆర్‌ భావించారన్నారు.చంద్రబాబు ఎప్పడూ అధికారంలోకి వచ్చిన కరువు తాండవమే చేస్తుందన్నారు.రైతుల గురించి ఆలోచన చేసింది సీఎం వైయస్‌ జగనే అని పేర్కొన్నారు.టీడీపీ పాలన ఫలితమే ఏపీని అప్పుల ఊబిలోకి వెళ్ళిందన్నారు.రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ఇంట్లో కలహాలే కారణమని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పారిపోయారన్నారు.గత ప్రభుత్వ వైఫల్యాలు చెబుతుంటే టీడీపీకి ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు.40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ఎక్కడికెళ్ళిందో అర్థం కావడం లేదన్నారు. 
మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేబినేట్‌లో స్థానం కల్పించామని తెలిపారు. ప్రజలు పూర్తిగా విశ్వాసం, నమ్మకంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారని అన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top