సీఎం వైయస్ జగన్ మైనార్టీల పక్షపాతి

మ‌ద‌న‌ప‌ల్లె వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి నిస్సార్ అహ్మ‌ద్‌

అన్నమయ్య జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మైనార్టీల ప‌క్ష‌పాతి అని మ‌ద‌న‌ప‌ల్లె వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి నిస్సార్ అహ్మ‌ద్ కొనియాడారు. మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్ధి నిసార్ అహ్మద్ ప్రసంగించారు.

నిస్సార్ అహ్మ‌ద్ ఏమ‌న్నారంటే..
అందరికీ నమస్కారం. మైనార్టీ వర్గానికి చెందిన రైతుబిడ్డ అయిన నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, 175 మంది సైనికుల్లో నన్నూ ఒక సైనికుడిగా ఎన్నుకున్న ప్రియతమ సీఎం వైయస్ జగన్ కు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రైతులకు గానీ, పేద, బడుగు బలహీన వర్గాలకు గానీ మంచి జరుగుతోంది అంటే అది జగనన్న ప్రభుత్వంలోనే. నేను కూడా ఆ కుటుంబంలో చేరినందుకు సంతోషిస్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ. సీఎం జగన్ ఇవాళ మమ్మల్ని ప్రజల్లోకి తలెత్తుకుని వెళ్లి ఓట్లు అడిగేలా చేశారు. ఎక్కడచూసినా ప్రజలు పూలవర్షాలు కురిపిస్తూ మంగళహారతులు పడుతున్నారు. ఇంత మంచి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి మనకు దొరకడం మన అదృష్టం. గత ఎన్నికల్లో 2 పేజీలతో మాత్రమే మేనిఫెస్టో ప్రకటించగా 151 సీట్లతో గెలిపించారు. ఆయన దాదాపు 125 సార్లు బటన్ నొక్కి 2 లక్షల 45 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఇదంతా చేశారు. దీంతో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో చెప్పేందుకు ఇక్కడికి వచ్చిన జనవాహినే నిదర్శనం. అందుకే ఎల్లప్పుడూ మదనపల్లె వాసులు సీఎం జగన్ కు రుణపడి ఉంటారు. సీఎం వైయస్ జగన్ మైనార్టీల పక్షపాతి.. రాష్ట్రవ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు. కాబట్టి మదనపల్లె ఎమ్మెల్యే తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించి సీఎం వైయస్ జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను.           

పెన్షన్లు ఆపేసిన చంద్రబాబు బుద్ధిని ప్రజలంతా గమనించాలి: ఎంపీ మిథున్ రెడ్డి  

వేదికపై ఉన్న పెద్దలకు, ఇక్కడకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులందరికీ నమస్కారం. మన నియోజకవర్గం, మన రాజంపేట పార్లమెంట్, మన అన్నమయ్య జిల్లాపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు తన ప్రేమను మాటల్లో కాదు చేతల్లో చూపించారు. ఈరోజు కోడూరు నియోజకవర్గంలో సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్టు, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య ప్రాజెక్టుగానీ, పింఛా ప్రాజెక్టుగానీ అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతాజిల్లాల్లో గాలేరు-నగరి, అదేవిధంగా హంద్రీనీవాను అనుసంధానం చేసి శాశ్వతంగా మనకు సాగునీరు గానీ, త్రాగునీరు గానీ ఇబ్బందులు లేకుండా సీఎం వైయస్ జగన్ ఏమాట అయితే చెప్పారో ఆవిధంగా పనులు జరుగుతున్నాయని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి పైప్ లైన్ నీళ్లు వచ్చే ప్రాజెక్టును కూడా మనకు శాంక్షన్ చేశారు. ఇంతేకాదు హాస్పిటళ్లు గానీ, బడులు గానీ, రోడ్లు గానీ ఇవన్నీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. ఇవన్నీ కూడా మనపై సీఎం వైయస్ జగన్ చూపించే ప్రేమ అని తెలియజేస్తున్నాను. కచ్చితంగా రాబోయే రోజుల్లో మీఅందరి ఆశీస్సులతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా మనమంతా కూడా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటులో ఏడుకు 7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. అంతేకాదు మీరంతా గమనిస్తున్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది. ఈ ఒక్క నెలలోనే ఈరోజు పెన్షన్ తీసుకునేవాళ్లందరూ కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి. పెన్షన్లు ఆపేసిన చంద్రబాబు బుద్ధిని ప్రజలంతా గమనించాలి. రాష్ట్రాన్ని విడగొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మూడ్రోజుల ముందు సూట్ కేసు తీసుకొచ్చాడు. పది సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్కరికి సాయం చేసిన పాపాన పోలేదు. కరోనా సమయంలో కూడా మనల్ని అందర్నీ కాపాడింది మన జగనన్నే. కచ్చితంగా జూన్ 4వ తేదీన అదే సూట్ కేసు ఎత్తికొని హైదరాబాద్ పంపించేలా అత్యధిక మెజార్టీతో మన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా పార్లమెంట్ ను కూడా గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను.

Back to Top