ముఖ్య‌మంత్రిని క‌లిసిన వివిధ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు

వివిధ అసోసియేష‌న్ల డైరీలు, క్యాలెండ‌ర్ల‌ను ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వివిధ ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల ప్ర‌తినిధులు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి నూత‌న సంవ‌త్స‌రం, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే ఆర్‌ సూర్యనారాయణ, అసోసియేషన్‌ ప్రతినిధులు జి ఆస్కార్‌ రావు, జి ఎం రమేష్‌ కుమార్‌లు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హాజ‌ర‌య్యారు.

అదే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఏపీ ఎన్టీఓస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అసోసియేషన్‌ ప్రతినిధులు జి. హృదయరాజు, కే వి శివారెడ్డి, హెచ్‌ తిమ్మన్న, కే  ఎస్‌ ఎస్‌ ప్రసాద్, ఎల్‌ సీతారామరాజు, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జానీ పాషా షేక్‌ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ రూపొందించిన డైరీలు, క్యాలెండ‌ర్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను ఏపీ సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె వెంకటరామిరెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు సిహెచ్‌ ఎర్రన్న యాదవ్, ఎం సత్య సులోచన, కృష్ణలు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సెక్ర‌టేరియ‌ట్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ రూపొందించిన డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పీఆర్టీయూ–ఏపీ అధ్యక్షుడు గిరిప్రసాద్‌ రెడ్డి, సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎంకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్క‌రించారు. ముఖ్యమంత్రిని క‌లిసిన వారిలో ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పి ధర్మచంద్రారెడ్డి, కె మోహన్‌ కుమార్, ఈ. మురళీ ఉన్నారు. 

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను వైయ‌స్ఆర్ టీఎప్-ఏపీ రాష్ట్ర నేత‌లు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఎం వైయస్ జగన్‌కు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రిని క‌లిసిన వారిలో వైయ‌స్‌ఆర్‌టీఎఫ్‌–ఏపీ రాష్ట్ర నేతలు ఓబులాపతి, జాలిరెడ్డి, అశోక్, సుధీర్‌లు.  పాల్గొన్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఉన్నారు. 

Back to Top