చంద్రబాబు పాపం పండింది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి
 

అమరావతి: ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు వచ్చాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ నందమూరి లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి పరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. అవినీతి బాగోతం అంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోందన్నారు.

తాజా వీడియోలు

Back to Top