`రాజన్న వన వికాసం` పుస్తక ఆవిష్క‌ర‌ణ‌

తాడేప‌ల్లి: పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు.. పర్యావరణ పరిరక్షణకు పునాదిరాళ్లు అని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు `జగనన్న పచ్చతోరణం` కార్యక్రమంలో భాగంగా "రాజన్న వన వికాసం" అనే పుస్తకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దాన్ని నిర్లక్ష్యం వహిస్తే ప్రకృతిలో సమతుల్యత లోపించి యావత్ జగత్ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనవాళి ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలన్నీ అందుకే జరుగుతున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, నేతలు దేవళ్ల రేవతి, గులాం రసూల్, కొమ్మాలపాటి మాణిక్యరావు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top